హైద్రాబాద్  వరద నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారం:  గంటల తర్వాత దొరికింది

హైదరాబాద్:  బంజారాహిల్స్ లో వరద నీటిలో కొట్టుకుపోయిన కిలోన్నర బంగారం ఎట్టకేలకు దొరికింది. భారీ వర్షంలో బంగారాన్ని తరలిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది.

హైద్రాబాద్ నగరంలోని వీఎస్ గోల్డ్ జ్యూయలరీ నుండి జూబ్లీహిల్స్ లోని కృష్ణా పెరల్స్ షాపుకు నగలు తరలిస్తున్న సమయంలో సోమవారం నాడు రాత్రి ఈ ఘటన చోటు చేసుకొంది.టూ వీలర్ పై బంగారాన్ని సేల్స్ మెన్ బంగారాన్ని తరలిస్తున్నాడు. వరద నీటిలో బంగారం కొట్టుకుపోయింది. ఈ విషయాన్ని అతను యజమానికి చెప్పాడు. 

బంగారం దుకాణంలో పనిచేసే సిబ్బంది రాత్రి నుండి వరద నీటిలో కొట్టుకుపోయిన బంగారం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 
బంజారాహిల్స్ పోలీసులకు కూడ  పోలీసులకు బంగారం షాపు యజమాని ఫిర్యాదు చేశాడు. 

ఇవాళ ఉదయం బంగారాన్ని స్వాధీనం చేసుకొన్నారు. వరద నీటిలో కొట్టుకుపోయిన బంగారం తిరిగి దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకొన్నారు.