ఐటీ అధికారులంటూ సికింద్రాబాద్ జ్యుయలరీ షాప్ లో దోపీడీ : థానేలో నలుగురు అరెస్ట్
సికింద్రాబాద్ జ్యుయలరీ షాపు దోపీడీ కేసులో నలుగురిని హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు. ఐటీ అధికారుల పేరుతో సికింద్రాబాద్ జ్యుయలరీ షాపు నుండి రెండు కిలోల బంగారాన్ని దుండగులు దోచుకున్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ జ్యుయలరీ షాపు దోపీడీ కేసులో పురోగతి సాధించారు పోలీసులు . ఐటీ అధికారుల పేరుతో సికింద్రాబాద్ లోని జ్యుయలరీ షాపులో రెండు కిలోల బంగారం దోచుకున్న ముఠాను హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.మహారాష్ట్రలోని థానేలో జకీర్, రహీమ్ , ప్రవీణ్, అక్షయ్ లను ఇవాళ హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సికింద్రాబాద్ లోని ఓ జ్యుయలరీ షాపులో దోపీడీ దొంగల ముఠా ఐటీ అధికారులుగా చెప్పుకుంటూ తనిఖీలు నిర్వహించారు. జ్యుయలరీ దుకాణం నుండి సుమారు రెండు కిలోల బంగారాన్ని దుండగులు దోచుకున్నారు. ఈ విషయమై జ్యుయలరీ దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.
సికింద్రాబాద్ ప్రాంతంలోని పలు జ్యయలరీ దుకాణాలపై దోపీడీ గ్యాంగ్ రెక్కీ నిర్వహించింది. చివరికి సికింద్రాబాద్ లోని నాలుగో అంతస్తులో ఉన్న ఓ జ్యుయలరీ దుకాణాన్ని ఎంచుకొని దోపీడీకి పాల్పడ్డారు.
జ్యుయలరీ దుకాణంలో దోపీడీకి పాల్పడడానికి వారం రోజుల ముందుగా ఇదే ప్రాంతంలోని ఓ లాడ్జీలో దుండగలు ఉన్నారని పోలీసులు గుర్తించారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు . జ్యుయలరీ దుకాణంలో దోపీడీకి పాల్పడిన తర్వాత దుండగులు మహారాష్ట్రకు పారిపోయారు. మహరాష్ట్ర పోలీసుల సహకారంతో హైద్రాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.