హైద్రాబాద్లో నకిలీ వెపన్ లైసెన్స్ ముఠా అరెస్ట్:ఆయుధాలు, బుల్లెట్లు సీజ్
నకిలీ వెపన్ లైసెన్స్ ఇస్తున్న ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.పోలీసు ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేసి లైసెన్సులు జారీ చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్: నకిలీ వెపస్ లైసెన్స్ ఇస్తున్న ముఠాను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారంనాడు నలుగురిని అరెస్ట్ చేశారు. మరో ముగ్గురి కోసం పోలీసులు పరారీలో ఉన్నారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.నిందితుల నుండి 30 సింగిల్ బోర్ , 3 డబుల్ బోరు గన్లు స్వాధీనం, రివాల్వర్, 140 బుల్లెట్లను పోలీసులు సీజ్ చేశారు.పోలీసు ఉన్నతాధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ గన్ లైసెన్స్ లను ఈ ముఠా అందిస్తుంది. ఈ లైసెన్స్ లతో పాటు ఆయుధాలను విక్రయిస్తున్నారు. ఈ విషయమై అందిన కచ్చితమైన సమాచారం మేరకు పోలీసులు నిందితులను పట్టుకున్నారు.ఈ ముఠాలో మరో ముగ్గురు సభ్యులు పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.