Asianet News TeluguAsianet News Telugu

దసరా వేడుకలే టార్గెట్‌‌గా ఉగ్ర కుట్ర.. హైదరాబాద్‌కు తప్పిన ముప్పు, పోలీసుల దర్యాప్తులో కీలకాంశాలు

పోలీసులు అలర్ట్ కాకుంటే హైదరాబాద్‌లో పెను విధ్వంసమే జరిగేది. ఉగ్రవాది జాహిద్‌ అండ్ గ్యాంగ్‌ అరెస్ట్‌తో అనేక కీలకాంశాలు వెలుగులోకి వచ్చాయి. జాహిద్‌తో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వీరిని సుజి, సమియుద్దిన్, అదీల్ అఫ్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషి, అబ్ధుల్ కలీమ్‌లుగా గుర్తించారు. 

hyderabad police arrest terrorists
Author
First Published Oct 2, 2022, 6:35 PM IST

హైదరాబాద్‌లో పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులకు పట్టుబడ్డ జాహిద్‌ విషయంలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అతని ముఠా దసరా ఉత్సవాలను టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. దసరా పర్వదినం రోజున మూకుమ్మడి దాడులకు ఈ గ్యాంగ్ కుట్ర పన్నినట్లుగా సమాచారం. హైదరాబాద్ సీసీఎస్, సిట్‌లో జాహిద్ అండ్ టీమ్‌పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. జాహిద్‌తో పాటు ఏడుగురిపై కేసు నమోదు చేశారు. వీరిని సుజి, సమియుద్దిన్, అదీల్ అఫ్రోజ్, అబ్దుల్, సోహెల్ ఖురేషి, అబ్ధుల్ కలీమ్‌లుగా గుర్తించారు. 

ALso REad:ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్.. హైదరాబాద్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర, భగ్నం చేసిన పోలీసులు

పాకిస్తాన్‌లో వున్న హ్యాండ్లర్స్ ద్వారా జాహిద్‌కు భారీగా నిధులు అందినట్లుగా తెలుస్తోంది. అలాగే టెర్రర్ దాడుల కోసం పాకిస్తాన్ నుంచి గ్రనేడ్స్ పంపారు ఉగ్రవాదులు. జనసమ్మర్ధం ఎక్కువగా వుండే ప్రాంతాల్లో మూకుమ్మడి దాడులకు కుట్ర పన్నినట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లో పేలుళ్లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలని వీరంతా కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ నేతలను కూడా వీరు టార్గెట్ చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. గతంలో హైదరాబాద్ పేలుళ్ల కేసులో జాహిద్‌ను పోలీసులు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. జాహిద్‌కు పాకిస్తాన్‌లో ఐఎస్ఐకు చెందిన హ్యాండ్లర్స్‌తో లింకులు వున్నట్లు పోలీసులు గుర్తించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios