ఆర్ఎస్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్.. హైదరాబాద్‌లో విధ్వంసానికి ఉగ్రవాదుల కుట్ర, భగ్నం చేసిన పోలీసులు

హైదరాబాద్‌లో భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆర్ఎస్ఎస్ , బీజేపీ నేతలే టార్గెట్‌గా పేలుళ్లకు కుట్రపన్నిన జాహిద్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పలు టెర్రర్ గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నట్లుగా తెలుస్తోంది.

hyderabad police breaks terrorist plan

హైదరాబాద్‌లో పేలుళ్ల కుట్రను భగ్నం చేశారు పోలీసులు. ఆర్ఎస్ఎస్ , బీజేపీ నేతలే టార్గెట్‌గా పేలుళ్లకు కుట్రపన్నాడు జాహిద్ అనే వ్యక్తి. ఉగ్రవాద కార్యకలాపాల కోసం యువకులను రిక్రూట్‌మెంట్ చేసుకున్నాడు. ఇప్పటికే ఆరుగురు యువకులను ఉగ్రవాద సంస్థల కోసం రిక్రూట్‌ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జాహిద్‌ను అదుపులోకి తీసుకున్నారు హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు. పలు టెర్రర్ గ్రూపులతో జాహిద్‌కు లింకులు వున్నట్లుగా తెలుస్తోంది. గతంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మక్కా మసీదు పేలుళ్ల కేసులోనూ జాహిద్‌ను ప్రశ్నించారు పోలీసులు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios