Asianet News TeluguAsianet News Telugu

హుస్సేన్ సాగర్ చుట్టూ నైట్ బజార్.. !

Hussainsagarను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి వీలుగా సాగర్ వెంబడి దాదాపు 1,300 మీటర్ల విస్తీర్ణాన్ని గుర్తించారని.. కొన్ని సంవత్సరాల క్రితం GHMC, చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ లో భాగంగా ఓల్డ్ సిటీలో ఇలాంటి నైట్ బజార్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది, కానీ అది కార్యాచరణలోకి రాలేదని కేటీఆర్ అన్నారు. 

Hyderabad : Night bazaar along Hussainsagar soon
Author
Hyderabad, First Published Oct 9, 2021, 8:48 AM IST

హైదరాబాద్ : ట్యాంక్ బండ్‌పై ‘సండే-ఫండే’ కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత, మున్సిపల్ పరిపాలన విభాగం ఇప్పుడు హుస్సేన్‌సాగర్ చుట్టూ ‘నైట్ బజార్’ ఏర్పాటు చేయడానికి సన్నద్ధమైంది. గత ఏడాదిలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నప్పటికీ, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా డిపార్ట్‌మెంట్ ఈ ప్రణాళికను ముందుకు తీసుకువెళ్లలేకపోయింది.  

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి కెటి రామారావు శుక్రవారం శాసన మండలిలో పట్టన ప్రగతిపై జరిగిన చర్చలో ఈ విషయాన్ని తెలియజేశారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు Hussainsagarను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయడానికి వీలుగా సాగర్ వెంబడి దాదాపు 1,300 మీటర్ల విస్తీర్ణాన్ని గుర్తించారు. HMDA ప్రతిపాదిత ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ ఫైబర్ రీన్ఫోర్స్డ్ ప్లాస్టిక్తో రిటైల్ యూనిట్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోందన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం GHMC, చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్ లో భాగంగా ఓల్డ్ సిటీలో ఇలాంటి నైట్ బజార్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది, కానీ అది కార్యాచరణలోకి రాలేదని అన్నారు. 

ప్రాజెక్ట్‌లో భాగంగా, సాగర్ దగ్గర వాతావరణాన్ని ఆహ్లాదంగా మార్చడానికి తీరప్రాంతంలో వుడ్ ప్లాస్టిక్ కాంపోజిట్ డెక్‌ను అధికారులు ప్లాన్ చేస్తున్నారు.
"గత ప్రభుత్వాలు కొన్ని, ప్రాధాన్యత ఉన్న రంగాలపై మాత్రమే దృష్టి సారించాయి. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం అభివృద్ధిపై సమగ్ర విధానాన్ని అవలంబిస్తోంది. పరిశ్రమలు, ఐటి రంగానికి ప్రాధాన్యత ఇస్తూనే.. మరోవైపు పల్లె ప్రగతి,  పట్టణ ప్రగతిలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. green cover ఎన్ హాన్స్ మెంటుకు కూడా ప్రాధాన్యత ఇవ్వబడింది "అని కేటీఆర్ తెలిపారు.

ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్,  HMDA పరిమితులు ఇతర మునిసిపాలిటీలలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల లిస్టును కూడా ఆయన పేర్కొన్నారు. 

కాగా, గతనెలలో హైదరాబాదులోని  ట్యాంక్ బండ్ మీద ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి  రాత్రి 10 వరకు వాహనాల రాకపోకలు నిలిపివేసి కేవలం సందర్శకులు ఆహ్లాదంగా గడిపేలా చర్యలు చేపట్టిన మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 

ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ కు ప్రత్యేక బస్సులు: టీఎస్ఆర్టిసి కీలక నిర్ణయం

అంతకు ముందు ఆదివారం ట్యాంక్ బండ్ మీద నగర పౌరులు కుటుంబసభ్యులతో సందడి చేశారు.  సందర్శకులు కుటుంబ సభ్యులతో గడిపిన తీరుపై పలు ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసిన కేటీఆర్ సందర్శకులకు మరింత ఆనందం కలిగించేలా హుస్సేన్ సాగర్ లో లేజర్‌ షో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అన్ని వైపుల నుంచి వీక్షించే లా గ్యాలరీలను ఏర్పాటు చేయాలన్నారు.  హస్తకళలు, సంగీతం, కళలకు ప్రాముఖ్యత ఇవ్వాలి అని చెప్పారు.  స్పెషల్ సీఎస్,  హెచ్ఎండిఎ కమిషనర్ అరవింద్ కుమార్  వెంటనే స్పందించి చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ పై సందర్శకులకు ఆహ్లాదంగా కలిగించేలా ల్యాండ్ స్కేప్,  పచ్చదనం పెంపు కోసం చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios