హైదరాబాద్ మెట్రో రైలు (hyderabad metro rail) ప్రయాణీకులకు శుభవార్త. ఇకపై ఉదయం 6 గంటల నుంచే మెట్రో అందుబాటులోకి రానుంది. అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కి చేసిన విజ్ఞప్తితో ఈ సదుపాయం అందుబాటులోకి వచ్చింది.
హైదరాబాద్ మెట్రో రైలు (hyderabad metro rail) ప్రయాణీకులకు శుభవార్త. ఇకపై ఉదయం 6 గంటల నుంచే మెట్రో అందుబాటులోకి రానుంది. కొద్దిరోజుల క్రితం అభినవ్ సుదర్శి అనే ప్రయాణికుడు ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్‌కి (minister ktr) ఒక మెసేజ్ పంపారు. అందులో ఈ విధంగా ఉంది. ప్రజలు ఉదయం 6 గంటలకు మెట్రో స్టేషన్‌లకు చేరుకుంటున్నారని.. కానీ 7 గంటల వరకు మెట్రో రైళ్లు సేవలు ప్రారంభమవడం లేదన సుదర్శి ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read:తెలంగాణ పథకాలకు బండి సంజయ్ బ్రాండ్ అంబాసిడర్: కేటీఆర్
క్యాబ్‌లు తీసుకోవడం ద్వారా ఆఫీసులకు చేరుకోవడానికి ప్రయత్నించినా చాలా ఖర్చు అవుతుందని చెప్పారు. దీనివల్ల సీనియర్ సిటిజన్లు ఉదయం పూట రద్దీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సుదర్శి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అందువల్ల మెట్రో సేవలు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించేలా చూడాలి అని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా ఫోటోలు, వీడియోలను కూడా జత చేశారు. స్పందించిన మంత్రి కేటీఆర్ ఆ విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ (hyderabad metr md) ఎన్‌విఎస్ రెడ్డికి (nvs reddy) ట్యాగ్ చేశారు. సదరు ప్రయాణికుడి అభ్యర్థనను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
ఈ విషయంపై స్పందించిన హెచ్‌ఎంఆర్‌ఎల్ (hmrl) ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మంత్రి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. నవంబర్ 10 నుంచి ఉదయం 6 గంటలకే మెట్రో రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. అలాగే రాత్రి 10.15 గంటలకు చివరి స్టేషన్ నుంచి మెట్రో రైలు బయలుదేరి.. రాత్రి 11.15 గంటలకు గమ్యస్థానానికి చేరుకుంటుందని హైదరాబాద్ మెట్రో తెలిపింది.
