Hyderabad Metro:న్యూ ఇయర్ వేడుకలు.. హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం
Hyderabad Metro: యూఇయర్ వేడుకలు జరుపుకునే హైదరాబాద్ వాసులకు మెట్రో రైల్వే శుభవార్త చెప్పింది. కొత్త సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 అర్ధరాత్రి వరకు రైళ్లను నడపాలని మెట్రో నిర్ణయించింది.
Hyderabad Metro: తన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ మెట్రో నగరవాసులకు శుభవార్త చెప్పింది. న్యూ ఇయర్ సందర్భంగా ఆదివారం రాత్రి నగరవాసులకు సురక్షిత, సులభతరం ప్రయాణాన్ని అందించడానికి మెట్రో పనివేళలను పెంచుతున్నట్టు హెచ్‌ఎంఆర్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌విఎస్ రెడ్డి తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మెట్రో రైళ్లను అర్ధరాత్రి వరకు నడుపుతామని హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ప్రకటించారు. చివరి రైళ్లు జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 12.15 గంటలకు చివరి రైలు బయలు దేరనున్నది. ఇలా అర్థరాత్రి ఒంటి గంటలకు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తామని ప్రకటించారు.
మరోవైపు.. మద్యం సేవించి అసభ్యంగా ప్రవర్తించకుండా మెట్రో రైల్ పోలీసులు, భద్రతా విభాగాలు నిశితంగా గమనిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆలస్య సమయాల్లో సురక్షిత ప్రయాణ ఏర్పాట్లపై చర్చించిన ఎల్‌అండ్‌టిఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండి కెవిబి రెడ్డి ప్రయాణికులు అధికారులకు సహకరించాలని, అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం ఇవ్వకుండా బాధ్యతాయుతంగా మెట్రో రైళ్లలో ప్రయాణించాలని విజ్ఞప్తి చేశారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా సాధారణంగా ఉ.6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తున్నాయి.