అరుదైన గౌరవం:స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో హైద్రాబాద్ మెట్రో రైలు విజయగాధ

స్టాన్ ఫోర్డ్  యూనివర్శిటీ హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఓ కేసు స్టడీగా చేసింది. ఈ విషయమై  ఆ యూనివర్శిటీ తాజా సంచికలోఈ స్టడీ నివేదికను ప్రచురించింది. 

Hyderabad Metro Rail, now a Stanford University case study lns

హైదరాబాద్: హైద్రాబాద్ మెట్రో రైలు (హెచ్ఎంఆర్) విజయంపై  స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ  ఒక కేస్ స్టడీగా చేసింది.ఈ యూనివర్శిటీ విద్యార్థులు, ప్రాక్టీషనర్లకు ఒక కేస్ స్టడీగా ఆ సంస్థ ప్రచురించే సోషల్ ఇన్నేవేషన్ రివ్యూ సంచికలో ఈ విషయాన్ని ప్రకటించింది.స్టాన్ ఫోర్డ్ సోషల్ ఇన్నేవేషన్ రివీ స్ప్రింగ్ 2024 సంచికలో ఈ విషయాన్ని  తెలిపారు. 

also read:హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ: ఎక్కడి నుండి ఎక్కడి వరకు, ఎప్పుడు పూర్తవుతాయంటే?

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ బృందం, ప్రొఫెసర్ రామ్ నిడుమోల్ టీమ్ సంయుక్తంగా  హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టుపై  అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో ప్రభుత్వ-ప్రైవేట్  భాగస్వామ్యానికి హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ప్రధాన ఉదహరణగా నిలిచింది.

హైద్రాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు అనేక అవాంతరాల మధ్య ప్రారంభమైంది.  అనేక సవాళ్లను ఎదుర్కొంటూ  హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టు ముందుకు సాగింది.తమ ముందుకు వచ్చిన సవాళ్లను  హైద్రాబాద్ మెట్రో ప్రాజెక్టు నాయకత్వం పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లిందని  ఈ అధ్యయనం తెలిపింది.

మేనేజ్ మెంట్ ప్రాక్టీషనర్లు హైద్రాబాద్ మెట్రో నుండి విలువైన పాఠాలను నేర్చుకోవచ్చని ఈ నివేదిక తెలుపుతుంది.  ప్రైవేట్ రంగం మద్దతుతో పెద్ద ఎత్తున పబ్లిక్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ప్రాజెక్టులను అమలు చేయడంలో ఇది సూచిస్తుందన్నారు.

also read:రోబో ద్వారా భోజనం సరఫరా: సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో

నగర విస్తరణలో హైద్రాబాద్ మెట్రో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రజా ప్రయోజనాల కోసం పెద్దగా కలలు కనే ధైర్యం చేసిన ప్రజాస్వామ్య నాయకత్వానికి  ఈ ప్రాజెక్టు ఉదహరణగా నిలుస్తుందని కేస్ స్టడీ పేర్కొంది.

also read:టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: పదేళ్ల తర్వాత మూడు పార్టీల మధ్య పొత్తు పొడుపు

హైద్రాబాద్ మెట్రో రైలు రెండో దశ పనులకు తెలంగాణ  రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఈ నెల  8వ తేదీన శంకుస్థాపన చేశారు.  మూడేళ్లలో ఈ ప్రాజెక్టు పనులను పూర్తి చేయనున్నారు. పాతబస్తీతో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి హైద్రాబాద్ మెట్రో ను విస్తరించనున్నారు.

also read:అత్యవసర సమయాల్లో కాపాడే బ్లూటూత్ జుంకాలు:ఎలా పనిచేస్తాయంటే?

మరో వైపు బీహెచ్ఈఎల్, హయత్ నగర్ వరకు కూడ హైద్రాబాద్ మెట్రో రైలు విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గతంలో  కేసీఆర్ సర్కార్ సూచించిన రూట్ మ్యాప్ లో స్వల్ప మార్పులు చేర్పులు చేసింది రేవంత్ రెడ్డి సర్కార్.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios