టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు: పదేళ్ల తర్వాత మూడు పార్టీల మధ్య పొత్తు పొడుపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  బీజేపీ,టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరింది. రానున్న అసెంబ్లీ,పార్లమెంట్ ఎన్నికల్లో  ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి.

BJP-TDP-Jana Sena Alliance Announced; Naidu Ready to Give Up 8 Lok Sabha and 30 Assembly Seats lns

అమరావతి: తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది.  ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయాన్ని  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా  శనివారం నాడు సోషల్ మీడియా వేదికగా  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.పదేళ్ల తర్వాత  ఈ మూడు పార్టీలు మరోసారి కలిసి పనిచేయనున్నాయి.

పొత్తు విషయమై చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు,జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్ లు  ఈ నెల 7వ తేదీన న్యూఢిల్లీకి వెళ్లారు. అదే రోజు రాత్రి అమిత్ షా, జే.పీ. నడ్డాతో  చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు చర్చించారు.  ఈ చర్చలకు కొనసాగింపుగా ఈ నెల 9వ తేదీన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు  అమిత్ షా, జే.పీ. నడ్డాలతో చర్చించారు.ఈ నెల 7వ తేదీన జరిగిన సమావేశంలోనే  ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నాయి.ఈ చర్చలకు కొనసాగింపుగా  నిన్న జరిగిన సమావేశంలో సీట్ల షేరింగ్ పై మూడు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.  జనసేన, బీజేపీకి  30 అసెంబ్లీ, ఎనిమిది పార్లమెంట్ స్థానాలను కేటాయించింది తెలుగుదేశం పార్టీ.

also read:మిస్ వరల్డ్ 2024: చెక్ రిపబ్లిక్ కు చెందిన క్రిస్టినా పిస్కోవాకు కిరీటం

2014 ఎన్నికల సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ,బీజేపీ కూటమికి  జనసేన మద్దతు ప్రకటించింది.ఈ కూటమి తరపున బరిలో ఉన్న అభ్యర్థులకు పవన్ కళ్యాణ్  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ప్రచారం నిర్వహించారు.  2014  ఎన్నికల్లో  అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం ప్రభుత్వం బీజేపీ చేరింది. కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలో టీడీపీ చేరిన విషయం తెలిసిందే.

also read:మరిది పెళ్లిలో వదిన డ్యాన్స్: సోషల్ మీడియాలో వైరలైన వీడియో

2019 ఎన్నికలకు ముందు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో  ఎన్‌డీఏకు తెలుగుదేశం పార్టీ దూరమైంది.  2019 ఎన్నికల్లో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ ఘోర పరాజయం పాలైంది.

also read:న్యూఢిల్లీలో బోరు బావిలో పడిన చిన్నారి: సహాయక చర్యలు ప్రారంభం

2019 నుండి  ఇప్పటివరకు  చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో  బీజేపీకి దగ్గర కావాలని టీడీపీ భావించింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి రాకుండా అడ్డుకుంటామని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రకటించారు.ఈ ప్రకటనకు అనుగుణంగా  పవన్ కళ్యాణ్  తెలుగుదేశం పార్టీతో  కలిసి ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టుగా  ప్రకటించారు.

also read:అత్యవసర సమయాల్లో కాపాడే బ్లూటూత్ జుంకాలు:ఎలా పనిచేస్తాయంటే?

 2023 సెప్టెంబర్ మాసంలో పవన్ కళ్యాణ్  టీడీపీతో జత కట్టనున్నట్టుగా  ఆయన ప్రకటించారు. తమ కూటమిలో బీజేపీలో చేరుతుందని  తొలి నుండి  పవన్ కళ్యాణ్  ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

also read:టేకాఫైన కొద్దిసేపటికే నిద్రపోయిన పైలెట్లు:దారితప్పిన విమానం

అయితే ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్నాయి.  ఈ విషయమై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జే.పీ. నడ్డా  శనివారం నాడు అధికారికంగా ప్రకటించారు.2014 ఎన్నికల్లో  ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్నాయి. కానీ,2024లో 2014 ఎన్నికల ఫలితాలు వస్తాయా, లేదా అనేది భవిష్యత్తు తేల్చనుంది.



  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios