రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. మరో వైపు వర్ష తీవ్రత తగ్గినప్పటికీ హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తి వేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. 

హైదరాబాద్‌ : గులాబ్‌ తుపాను (Cyclone Gulab) ప్రభావం తెలంగాణ (Telangana)రాష్ట్రంపై తగ్గిపోయిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Center) ప్రకటించింది. ప్రస్తుతం ఇది తీవ్ర అల్ప పీడనంగా విదర్భ, మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైనట్టు వాతావరణ శాఖ సంచాలకులు డాక్టర్‌ నాగరత్నం తెలిపారు.

ఇప్పటి వరకు ఈ సీజన్‌లో సాధారణం కన్నా 40 శాతం అధిక వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు. వాయువ్య పరిసర ప్రాంతాల్లోని పశ్చిమ బెంగాల్‌ తీరంలో అల్పపీడనం ఏర్పడినట్టు పేర్కొన్నారు. 

రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని వివరించారు. మరో వైపు వర్ష తీవ్రత తగ్గినప్పటికీ హిమాయత్‌ సాగర్‌, ఉస్మాన్‌ సాగర్‌ జలాశయాల గేట్లను ఎత్తి వేయడంతో మూసీకి వరద పోటెత్తుతోంది. 

చాదర్‌ఘాట్‌, మూసారాం బాగ్‌ వద్ద వంతెనలను ఆనుకుని మూసీ ప్రవహిస్తోంది. మూసారాం బాగ్‌ వంతెనతో పాటు చాదర్‌ఘాట్‌ చిన్న బ్రిడ్జి పైకి రాకపోకలను నిలిపి వేశారు. దీంతో కోఠి-చాదర్‌ఘాట్‌ మార్గంలో భారీగా ట్రాఫిక్‌ నిలిచి పోయింది. జీహెచ్ఎంసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

Cyclone gulab:మూసీ నదిలో కొట్టుకుపోయిన మృతదేహం

ఇదిలా ఉండగా, గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్ తో మంగళవారం చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై అధికారులు రాకపోకలను నిలిపివేశారు. భారీ వర్షాల కారణంగా మూసీనదిలో వరద ప్రవాహం ఎక్కువైంది. దీంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బ్రిడ్జికి ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. మరోవైపు గులాబ్ తుఫాన్ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై తీవ్రంగా కన్పించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షం కారణంగా జనజీవనం స్థంబించింది. తెలంగాణలోని 14 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ (ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మర్రిగడ్డలో అత్యధికంగా 18.13 సెం.మీ వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాలలో 16.13 సెం.మీ వర్షపాతం రికార్డైంది.సిరిసిల్ల జిల్లా నాంపల్లిలో 15.98 సెం.మీ. వర్షపాతం, ఖమ్మం జిల్లా ఇచ్చోడలో 15.15 సెం.మీ వర్షపాతం నమోదైంది.

కరీంనగర్ జిల్లా కొత్తపల్లి ధర్మారంలో 14.9 సెం.మీ. జమ్మికుంటలో 14.8 సెం.మీ. వీణవంకలో 14.8 సెం.మీ. వైరాలో 14.2 సెం.మీ హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో 11.08 సెం.మీ వర్షపాతం నమోదైంది.గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైద్రాబాద్ నగరంలో కూడ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు జీహెచ్ఎంసీ అధికారులు. హైద్రాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడ పోలీస్ శాఖ అప్రమత్తమైంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షం కారణంగా పలుచోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.