Asianet News TeluguAsianet News Telugu

Cyclone gulab:మూసీ నదిలో కొట్టుకుపోయిన మృతదేహం


అంబర్ పేట వద్ద మూసీ నదిలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా భారీ వర్షాలతో మూసీ నదికి వరద పోటెత్తింది. వరద ఉధృతి కారణంగా మృతదేహన్ని తీయడం సాధ్యం కాలేకపోయిందని అధికారులు తెలిపారు.

Cyclone gulab:Mans body washed away in Musi River found
Author
Hyderabad, First Published Sep 28, 2021, 5:12 PM IST

హైదరాబాద్: హైద్రాబాద్ (hyderabad) అంబర్ పేట (Amberpet) వద్ద మంగళవారం నాడు గుర్తు తెలియని మృతదేహం  వరద నీటిలో కొట్టుకొచ్చింది. మూసీ (musi) నదిలో వరద ఉధృతంగా  ప్రవహిస్తున్న కారణంగా మృతదేహన్ని  బయటకు తీయలేకపోయారు రెస్క్యూ సిబ్బంది. 

also read:గులాబ్ ఎఫెక్ట్: పొంగిపొర్లుతున్న మూసీ... చాదర్‌ఘాట్ బ్రిడ్జిపై రాకపోకల నిలిపివేత, భారీగా ట్రాఫిక్ జాం

గులాబ్ తుఫాన్ ప్రభావం కారణంగా మూసీకి వరద పోటెత్తింది. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.చాదర్‌ఘాట్, శంకర్ నగర్, మూసారాంబాగ్ , ఓల్డ్ మలక్ పేట ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.రాష్ట్రంలోని 14 జిల్లాలకు  వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ఇచ్చింది.  వాతావరణ శాఖ హెచ్చరించినట్టుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలతో ఇవాళ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అయితే అత్యవసర రంగాలకు మాత్రం సెలవు నుండి మినహాయించింది ప్రభుత్వం. ఢిల్లీ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్వి సోమేష్ కుమార్ తో కేసీఆర్ చర్చించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios