విషాదం.. మెడికల్ షాప్ లో మందులు తీసుకుంటుండగా.. గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు..
గుండెపోటు.. ఒకప్పుడు వయసు పైబడిన వారికి వచ్చే అనారోగ్య సమస్య. ఈ సమస్యతో ప్రాణాలు కోల్పోయిన వారిలో వృద్ధులే ఎక్కువగా ఉండేవారు. ఇటీవల వయస్సుతో సంబంధం లేకుండా పోయింది. అధికంగా యువతకే గుండెపోట్లు వస్తున్నాయి. చూస్తుండగానే కుప్పకూలుతున్నారు.
ఇటీవల గుండెపోటు మరణాలు అధికమయ్యాయి. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హార్ట్ అటాక్ తో చనిపోతున్నారు. ప్రధానంగా యువతే ఎక్కువగా గుండెపోటు బారినపడుతున్నారు. అప్పటివరకు బాగున్న మనుషులు చూస్తుండగానే క్షణాల్లో కూప్పకూలిపోతున్నారు. ఆస్పత్రిలో తీసుకెళ్లే లోపే ప్రాణాలు కోల్పోతున్నారు.
తాజాగా హైదరబాద్ శివార్లలోని రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. మెడికల్ షాప్ కు వెళ్లిన 35 ఏండ్ల యువకుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకెళ్తే.. చేవెళ్లకు చెందిన శ్రీనివాస్ (35) అనే యువకుడు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ వలస వచ్చారు. అతడికి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఛాతీలో నొప్పిరావడంతో స్థానిక ప్రవేట్ ఆస్పత్రికి వెళ్లాడు. అతడ్ని డాక్టర్ పరీక్షించి.. ముందులు రాసి ఇచ్చారు. దీంతో ఆ ముందు కొనడానికి ఆ యువకుడు మెడికల్ షాష్ దగ్గరకి వెళ్లాడు. అందరూ చూస్తుండగానే అక్కడిక్కడే ఆ యువకుడు కుప్పకూలిపోయాడు. ఆపై ప్రాణాలు కోల్పాడు.
ముఖ్యంగా కరోనా తర్వాత యువకులు అధికంగా గుండెపోటు బారినపడుతున్నారు.ప్రధానంగా 40 ఏళ్లలోపు వారు గుండెపోటు బారిన పడటం గత రెండు దశాబ్దాలుగా పెరుగుతున్నదని ఓహియో స్టేట్ యూనివర్సిటీ సర్వే ఇటీవల వెల్లడించింది.