హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు.. రూ. 10 కోట్లు విలువైన డ్రగ్స్ సీజ్..

హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయింది. ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

hyderabad malkajgiri Police arrest two members of international drugs gang

హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు అయింది.  ముఠాకు చెందిన ఇద్దరు నిందితులను మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి దాదాపు 8 కిలోల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద పట్టుబడిన డ్రగ్స్ విలువ దాదాపు రూ. 10 కోట్లు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు.ఈ ముఠా హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. న్యూ ఈయర్ వేడుకల నేపథ్యంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరాకు ముఠా ప్లాన్ చేసిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ సిబ్బందితో కలిసి మంగళ్‌హాట్ పోలీసులు శనివారం ముగ్గురు గంజాయి వ్యాపారులను, ఒక గంజాయి రవాణాదారుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 72 కేజీల గంజాయి, 1.8 కేజీల గంజాయి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ప్రధాన ప్రధాన నిందితుడు హైదరాబాద్‌లోని మంగళ్‌హాట్‌లోని ధూల్‌పేట్ ఆకాష్ సింగ్‌గా గుర్తించారు.  2018 నుంచి అతను ఖమ్మంకు చెందిన షేక్ సుభానీ నుంచి గంజాయిని సేకరించి హైదరాబాద్‌లో పలువురు వినియోగదారులకు విక్రయిస్తున్నాడు.

అతడిపై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో 5 కేసులు ఉన్నాయి. అంతకుముందు అతను 2021లో పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయబడ్డాడు. అయితే 2022 జూన్‌లో అతడు విడుదలయ్యాడు. తిరిగి గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడు. ఇక, షేక్ సుభానీ ఒడిశా రాష్ట్రంలోని పాపులూరులో గంజాయిని పండించే వల్సగడ్డ మహేష్ నుంచి పెద్దమొత్తంలో గంజాయిని సేకరించి.. హైదరాబాద్‌లో ప్రధాన వ్యాపారి అయిన ఆకాష్ సింగ్‌కు రవాణా చేస్తున్నాడు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios