సూసైడ్ నోట్, వీడియో పంపించి చర్లపల్లి జైలు వార్డెన్ అదృశ్యం

Hyderabad jail warden missing after sending suicide note, video
Highlights

సూసైడ్ నోట్, వీడియో పంపించి హైదరాబాదులోని చెర్లపల్లి జైలు వార్డెన్ కనిపించకుండా పోయాడు. వాటిని తన ఉన్నతాధికారులకు ఆదివారంనాడు పంపించాడు. సీనియర్ల వేధింపులే అందుకు కారణమని భావిస్తున్నారు. 

హైదరాబాద్: సూసైడ్ నోట్, వీడియో పంపించి హైదరాబాదులోని చెర్లపల్లి జైలు వార్డెన్ కనిపించకుండా పోయాడు. వాటిని తన ఉన్నతాధికారులకు ఆదివారంనాడు పంపించాడు. సీనియర్ల వేధింపులే అందుకు కారణమని భావిస్తున్నారు. 

జైలు సూపరింటిండెంట్ వేధిస్తున్నారని అదృశ్యమైన వార్డెన్ కె. శ్రీనివాస్ సూసైడ్ నోట్ లో రాయడమే కాకుండా వీడియోలోనూ అదే విషయం చెప్పాడు. తన మరణానికి సూపరింటిండెంట్ కారణని ఆరోపించాడు.

తనపై చేసిన ఆరోపణల్లో నిజం లేదని అతను చెప్పాడు. తనను వేధించడానికే ఆరోపణలు చేస్తున్నారని అన్నాడు. ఇంటికి తిరిగి రావాలని ఆయన కుటుంబ సభ్యులు కోరారు.ట 

తన భార్యకు, పిల్లలకు సాయం చేయాలని ఆయన ముఖ్యమంత్రిని, హోం మంత్రిని కోరాడు.

loader