Hyderabad: వరుస దొంగతనాలకు అలవాటుపడిన ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను సీసీఎస్ ఎల్‌బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 440 గ్రాముల బంగారం, 568 గ్రాముల వెండి సహా మొత్తం రూ.32 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
Telangana : రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లోని ఎల్‌బి నగర్ పోలీసులతో పాటు సిసిఎస్ ఎల్‌బి నగర్ బృందం పోలీసులు.. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. ఎల్‌బీ నగర్ పీఎస్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో నిందితుడు సంచరిస్తున్న క్రమంలో పోలీసులు అతన్ని ప్రశ్నింగా వారి దొంగతనాలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ఇద్దరిపై ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. ప్రధాని నిందితుడు జగన్నాథ్ S/o తిమ్మన్న.. ఇతని వయస్సు 28 సంవత్సరాలు.. కారు డ్రైవర్ గా పనిచేస్తూ.. దొంతతనాలకు పాల్పడుతున్న ఇతని సొంతూరు కర్నాటకలోని తుమ్మకూరు జిల్లాలోని కొడిగ హడ్డి . మరో నిందితుడు బ్రహ్మదౌ అలియాస్ బ్రహ్మదేవర రాజయ్య (రాజా శ్రీ గణేష్) పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
నిందితులపై ఇప్పటికే తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కలిపి మొత్తం ఏడు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితుల నుంచి 440 గ్రాములు బంగారు నగలు, 568 గ్రాములు వెండినగలు, అలాగే, రూ. 25,000/- నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొత్తం వస్తువుల విలువ రూ. 32,00,000/- ఉంటుందని పోలీసులు తెలిపారు. నేరస్థులు జగన్నాథ్, శ్రీ గణేష్ పాత నేరస్థులనీ, వీరిద్దరిపై ఇంతకుముందు ఆస్తి అక్రమాలకు సంబంధించి వేర్వేరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదుకావడంతో పాటు అరెస్టు చేసి జైలుకు పంపబడ్డారు. 2017లో నిందితుడు జగన్నాథ్‌ను ఇందిరానగర్ పీఎస్ అధికారులు అరెస్టు చేశారు.
బెంగళూరు పోలీసులు జైలుకు పంపారు. ఆ తర్వాత 2019లో బెంగళూరులోని వర్టూర్ పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత చిత్రదుర్గ జిల్లా హిరియూరు పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2021లో కర్నాటక రాష్ట్రం దేవనహళ్లి PS ద్వారా అరెస్టు చేసి జైలుకు పంపబడ్డాడు. 2022 ఫిబ్రవరి 10న జైలు నుండి విడుదలయ్యాడు.
2014లో నిందితుడు రాజ్‌శ్రీ గణేష్‌ను ఆస్తి నేరాల్లో మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆస్తి నేరాల్లో నిందితుడిని మళ్లీ ఘటేకేసర్ పీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2018లో నిందితుడు ఎ2 రాజా శ్రీ గణేష్‌ను ఎల్‌బి నగర్ పిఎస్ ద్వారా ఆస్తి నేరాలలో ఇతర నిందితులతో పాటు అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆ సమయంలో ఏ2 రాజా శ్రీ గణేష్‌పై పీడీ యాక్ట్ పెట్టారు. జైలు నుంచి విడుదలైన తర్వాత బెంగళూరు వెళ్లి అక్కడ ఏ1 జగన్నాథ్‌తో సాధారణ స్నేహితుడు ధనుంజయ్‌తో పరిచయం ఏర్పడింది. తర్వాత వారిద్దరూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నేరాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నేరాలకు పాల్పడిన తర్వాత నిందితులు దొంగిలించబడిన మొత్తాన్ని ఉపయోగించి "OLX"లో ఒక ఫోర్డ్ ఫిగో కారును కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఫోర్డ్ ఫిగో కారులో తిరుగుతూ.. ప్రొద్దుటూరు, బంజారాహిల్స్, బళ్లారి ప్రాంతాల్లో నేరాలకు పాల్పడ్డారు.
