Asianet News TeluguAsianet News Telugu

హీరోయిన్స్ ఫోటోలతో ఘరనా మోసం.. కాల్ గల్స్ అంటూ గాలం

యువతకు హీరోయిన్స్ ఫోటోలతో గాలం

hyderabad guy arrested for used heroins photos in escort agency

‘‘వ్యాపారంలో నష్టపోయాడు... సంవత్సరాలుగా ఉద్యోగం చేసినా  ఆ నష్టం తీరేలా కనపడలేదు. దీంతో.. కొత్త వ్యూహం రచించాడు. హీరోయిన్స్ ఫోటోలతో గాలం వేశాడు.. ఇంకేముంది..డబ్బు కట్టలు కట్టలుగా వచ్చి పడింది. కానీ చివరకు పోలీసులకు చిక్కాడు.’’

అసలు కథేంటంటే... హైదరాబాద్ నగరానికి చెందిన గణేష్ సైన్సులో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. అనంతరం పలు ప్రముఖ ఇంటర్ కళాశాలల్లో లెక్చరరుగా పనిచేసి ఇటీవల దిల్ సుఖ్ నగర్ లోని ఓ కళాశాలకు ప్రిన్సిపాల్ అయ్యారు. 

కొన్ని నెలల కిందట ఆ ఉద్యోగాన్ని కూడా వదిలివేసిన గణేష్ సులభంగా డబ్బు సంపాదించేందుకు ఎస్టార్టు సర్వీసు పేరిట యువకుల నుంచి డబ్బు వసూలు చేశాడు.మాజీ అధ్యాపకుడైన గణేష్ ప్రముఖ సినీతారల ఫోటోలు క్లాసిఫైడ్ వెబ్‌సైట్‌లో పెట్టి వారి పేరిట రూ.40వేల నుంచి రూ.60 వేలంటూ రేట్ కార్డులు పెట్టాడు. 

ఎస్కార్టు సర్వీసు పేరిట యువకుల నుంచి డబ్బు వసూలు చేశాడు. యువకులు ఎస్కార్టు సర్వీసు కోసం డబ్బు ఖాతాకు బదిలీ చేయగానే మొబైల్ ఫోన్ స్విచాఫ్ చేసేవాడు.ఓ  ప్రముఖ సినీ క్యారెక్టర్ ఆర్టిస్టు ఇచ్చిన ఫిర్యాదు మేర హైదరాబాద్ నగర సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి మాజీ అధ్యాపకుడైన గణేష్ పై ఐటీ యాక్టు కింద కేసు పెట్టి అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

తాను వ్యాపారంలో నష్టపోవడంతో దాన్నుంచి బయటపడేందుకే ఎస్కార్టు సర్వీసు పేరిట చీటింగ్ చేశానని గణేష్ పోలీసుల ఇంటరాగేషన్ లో అంగీకరించాడు. పోలీసులు అతని మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. గణేష్ ఖాతాలో ఎస్కార్టు సర్వీసు పేరిట రూ.8 లక్షల మేర లావాదేవీలు జరిగాయని పోలీసులు గుర్తించారు. కాగా ఎస్కార్టు సర్వీసు కాల్ గాళ్స్ పేరిట టాలీవుడ్ సినీతారలు, ప్రముఖ హీరోయిన్ల ఫోటోలు ఉండటంతో దీనిపై టాలీవుడ్ లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios