Asianet News TeluguAsianet News Telugu

రూ.300కోసం దాదాపు రూ.2లక్షలు పోగొట్టుకున్న హైదరాాబాద్ మహిళ

హైదరాబాద్ కు చెందిన మహిళను ఓ కొరియర్ సంస్ధకు చెందిన వ్యక్తి భారీ మోసానికి పాల్పడ్డాడు. 

hyderabad girl cheaten by courier service person  akp
Author
Hyderabad, First Published Jun 6, 2021, 8:55 AM IST

హైదరాబాద్: కేవలం రూ.300 కోసం ఏకంగా రెండు లక్షల రూపాయలు పోగొట్టుకుంది హైదరాబాద్ కు చెందిన ఓ మహిళ. తనకు జరిగిన మోసంపై సదరు మహిళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘరానా మోసం గురించి బయటపడింది. 

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ లో నివాసముండే ఉషారాణి ఆన్ లైన్ లో ఓ వస్తువున్న కొనుగోలు చేసింది. అయితే ఆ ఐటెంను తీసుకువచ్చిన కొరియర్ బాయ్ డబ్బులు తీసుకుని తిరిగివ్వాల్సిన రూ.300 వందలు ఇవ్వకుండా వెళ్లిపోయాడు. దీంతో ఆమె సంబంధిత కొరియర్ సంస్థ కాల్ సెంటర్ కు ఫోన్ చేసింది. ఆమె అమాయకత్వాన్ని అదునుగా తీసుకుని భారీ మోసానికి పాల్పడ్డాడు సదరు కొరియర్  సంస్ధ ఉద్యోగి. 

read more  రాసలీలల ఎస్సై సస్పెండ్... సిపి మహేష్ భగవత్ సీరియస్

రూ.300 తిరిగి మీ అకౌంట్ లో వేస్తామని... అయితే అంతకంటే ముందు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలు పంపించాలంటూ ఉషారాణికి సూచించాడు. ఒక అప్లికేషన్‌ను పంపి దానిని ఫిల్‌ చేసి తమకు ఆన్‌లైన్‌ ద్వారా పంపించాలని కోరాడు. అతడి మాటలు నిజమేనని నమ్మిన ఆమె అలాగే చేసింది. దీంతో ఆమె అకౌంట్ నుండి రూ.91వేలు కట్ అయ్యాయి.  

అకౌంట్ నుండి భారీగా డబ్బులు మాయం అవ్వడంతో మహిళ మరోసారి కొరియర్ సంస్థకు ఫోన్ చేసింది. మీరు తప్పుగా ఎంట్రీ చేశారు మళ్లీ ఓసారి అప్లికేషన్‌ ఫిల్‌ చేస్తే మొత్తం డబ్బు పంపిస్తామని చెప్పగా ఆమె అమాయకంగా అలాగే చేసింది. దీంతో మరోసారి రూ.99వేలు అకౌంట్ నుండి మాయమయ్యాయి. ఇలా రెండుసార్లు దాదాపు రూ.1.90వేలు మోసపోయిన మహిళ చివరకు పోలీసులను ఆశ్రయించింది. 

 
 

 

Follow Us:
Download App:
  • android
  • ios