హైదరాబాద్‌లోని వరంగరల్‌కు చెందిన చలమల్ల ఇక్షిత ఎరాస్మస్ ముండస్ సరీనా స్కాలర్‌షిప్( Erasmus Mundus SARENA Scholarship 2022)కి ఎంపికైంది.  రూ.50 లక్షల యూరోపియన్‌ స్కాలర్‌షిప్ ల‌భించింది.

తెలంగాణ విద్యార్థికి అరుదైన గౌర‌వం ద‌క్కింది. హైదరాబాద్‌లోని వరంగరల్‌కు చెందిన చలమల్ల ఇక్షిత ఎరాస్మస్ ముండస్ సరీనా స్కాలర్‌షిప్( Erasmus Mundus SARENA Scholarship 2022)కి ఎంపికైంది. ఇందులో ఆమెకు రూ.50 లక్షల యూరోపియన్‌ స్కాలర్‌షిప్ ల‌భించింది. ఈ యేడాది ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన ఏకైక భార‌తీయ‌ విద్యార్ధిగా ఇక్షిత నిలిచింది.

ప్ర‌స్తుతం చలమల్ల ఇక్షిత ఉత్తరప్రదేశ్ నోయిడాలోని అమిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AINST)లో బి.టెక్ (న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ) చ‌దువుతుంది. తాను పొందిన స్కాలర్‌షిప్‌ను యూరోప్‌లో న్యూక్లియర్ రియాక్టర్ ఆపరేషన్ & సేఫ్టీ (NROS) ప్రోగ్రామ్‌లో మాస్టర్స్ చేయ‌డానికి ఉప‌యోగించ‌నున్న‌ట్టు తెలిపింది.

హైదరాబాద్ విద్యార్థిగా ఆమె సాధించిన విజయానికి గుర్తింపుగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆమెను సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ఇక్షిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. 

ఇక్షిత.. న్యూక్లియర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో రేడియేషన్ సేఫ్టీ ఆఫీసర్‌గా లేదా న్యూక్లియర్ ఎనర్జీ కన్సల్టెంట్‌గా పని చేయాలని, భవిష్యత్తులో అణు భద్రత గురించి సలహాలను అందించాలని ఆకాంక్షిస్తుంది. ఇక్షిత తండ్రి చలమల్ల వెంకటేశ్వర్లు ఉస్మానియా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు.