తెలంగాణ కరోనా విజృంభణ కొనసాగుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కేసుల ఉద్ధృతి ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కోవిడ్ 19 కలకలం సృష్టించింది.

4వ ఫ్లోర్‌లోని ఒక సెక్షన్‌లో పనిచేసే ఉద్యోగికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నాలుగో అంతస్తు మొత్తాన్ని ఖాళీ చేసి, శానిటైజేషన్ చర్యలు ప్రారంభించారు.

Also Read:తెలంగాణలో కరోనా మృత్యు ఘంటికలు: ఒక్కరోజులో 14 మంది మృతి, 154 కేసులు

ఆ ఫ్లోర్‌లో పనిచేసే ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపించారు. కాగా దాదాపు 1,500 మంది ఉద్యోగులు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఈ ఘటనపై జీహెచ్ఎంసీ చీఫ్ ఎంటమాలజిస్ట్ రాంబాబు మాట్లాడుతూ.. కార్యాలయంలో ఉద్యోగికి పాజిటివ్‌గా తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారని తెలిపారు.

కార్పోరేషన్ కార్యాలయం మొత్తాన్ని శానిటైజ్ చేస్తున్నామని చెప్పారు. ఆఫీసులోని అన్ని ఫ్లోర్‌లను సిబ్బంది శుద్ధి చేస్తున్నారని.. ఉద్యోగులందరినీ ఒక హెల్త్ ఆఫీసర్ అబ్జర్వేషన్‌లో ఉంచామని రాంబాబు వివరించారు. కమీషనర్ ఆదేశాల మేరకు ఉద్యోగులకు మాస్కులు, శానిటైజర్లు, థర్మల్ స్క్రీనింగ్ సైతం ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. 

తెలంగాణలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 14 మంది మరణించడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 137కి పెరిగింది.

ఇవాళ కొత్తగా 154 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 3,650కి చేరింది. ఇప్పటి  వరకు తెలంగాణలో 1,742 మంది డిశ్చార్జ్ అవ్వగా, 1,771 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో రాష్ట్ర వాసులు 3,202 మంది ఉన్నారు.

ఆదివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ అధికంగానే కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 132 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రిలో 2, నాగర్ కర్నూలు, సిద్ధిపేట, మహబూబాబాద్, కరీంనగర్‌లో ఒక్కొక్కటి చొప్పున చొప్పున కొత్త కేసులను గుర్తించారు. 

Also Read:తెలంగాణ సర్కార్ సంచలనం: ఇకపై కరోనా పాజిటివ్ రోగులకు ఇంట్లోనే చికిత్స

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ స్పెషల్ ఆస్పత్రిగా కేటాయించిన గాంధీ ఆస్పత్రి రోగులతో నిండిపోయింది. శుక్రవారం వరకు రోజువారీగా వందకు పైగా కేసులు వస్తుండగా.. శనివారం ఒక్కరోజే ఏకంగా 200 మంది రోగుల రావడంతో గాంధీ ఆసుపత్రిలోని పడకలన్నీ దాదాపుగా ఫుల్ అయిపోయాయి. 

మే 26వ తేదీ వరకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 650. మే4 గురువారం నాటికి.. అంటే కేవలం పది రోజుల్లోనే 805 మంది పెరిగి 1,455 మంది అడ్మిట్ అయ్యారు.