తెలంగాణలో కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ఆదివారం ఒక్కరోజే 14 మంది మరణించడం ప్రభుత్వ వర్గాలను కలవరపాటుకు గురిచేస్తోంది. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 137కి పెరిగింది.

ఇవాళ కొత్తగా 154 కేసులు నమోదవ్వడంతో కేసుల సంఖ్య 3,650కి చేరింది. ఇప్పటి  వరకు తెలంగాణలో 1,742 మంది డిశ్చార్జ్ అవ్వగా, 1,771 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో రాష్ట్ర వాసులు 3,202 మంది ఉన్నారు.

Also Read:తెలంగాణ సర్కార్ సంచలనం: ఇకపై కరోనా పాజిటివ్ రోగులకు ఇంట్లోనే చికిత్స

ఆదివారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ అధికంగానే కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 132 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 12, మేడ్చల్‌లో 3, యాదాద్రిలో 2, నాగర్ కర్నూలు, సిద్ధిపేట, మహబూబాబాద్, కరీంనగర్‌లో ఒక్కొక్కటి చొప్పున చొప్పున కొత్త కేసులను గుర్తించారు. 

తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్‌ స్పెషల్ ఆస్పత్రిగా కేటాయించిన గాంధీ ఆస్పత్రి రోగులతో నిండిపోయింది. శుక్రవారం వరకు రోజువారీగా వందకు పైగా కేసులు వస్తుండగా.. శనివారం ఒక్కరోజే ఏకంగా 200 మంది రోగుల రావడంతో గాంధీ ఆసుపత్రిలోని పడకలన్నీ దాదాపుగా ఫుల్ అయిపోయాయి. 

మే 26వ తేదీ వరకు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 650. మే4 గురువారం నాటికి.. అంటే కేవలం పది రోజుల్లోనే 805 మంది పెరిగి 1,455 మంది అడ్మిట్ అయ్యారు. 

Also Read:కరోనా కలకలం: న్యూఢిల్లీ ఏపీ భవన్‌‌లో అధికారికి కరోనా, ఆఫీసుల మూసివేత

గాంధీ ఆస్పత్రిలో బెడ్లు దాదాపుగా నిండిపోగా, ఇంకా కేసులు మాత్రం భారిస్థాయిలోనే నమోదవుతూ ఉండడం, వారంతా గాంధీకే వస్తుండటం వైద్యులకు, ఇతర ఆరోగ్య సిబ్బందికి తలకుమించిన భారంగా మారింది. 

ఆస్పత్రిలో అందుబాటులో దాదాపుగా  1,160 పడకలుండగా కేసుల తీవ్రత దృష్ట్యా వైద్య కళాశాలలో మరో 350 బెడ్లను అదనంగా అడ్జస్ట్ చేశారు. దీంతో మొత్తం పడకల సంఖ్య 1,510 కు చేరాయి. కేసుల ఉధృతి గత కొన్ని రోజులుగా పెరుగుతుండడంతో వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది.