Asianet News TeluguAsianet News Telugu

Hyderabad Accident: అర్థరాత్రి తాగుబోతుల వీరంగం... అతివేగంతో దూసుకెళుతూ పల్టీలుకొట్టిన కారు

ఎంజాయ్ మెంట్ పేరిట యువత చేస్తున్న ఆగడాలు మితిమీరి ప్రాణాలమీదకు తెస్తున్నాయి. ఇలా హైదరాబాద్ లో తాగిన మత్తులో కారులో బయటకు వచ్చిన యువకులు యాక్సిడెంట్ కు గురయి హాస్పిటల్ పాలయ్యారు.

hyderabad drunk driving accident
Author
Hyderabad, First Published Jan 9, 2022, 8:48 AM IST

హైదరాబాద్: ప్రస్తుత ఆధునిక కాలంలో ఎంజాయ్ మెంట్ పేరిట యువత చెడువ్యసనాలకు బానిపై భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఈ ఎంజాయ్ మెంట్ శృతిమించి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా తెలంగాణ రాజధాని హైదరాబాద్ (hyderabad) లో  కూడా యువతీయువకులు పార్టీ కల్చర్ పేరిట పీకలదాక మద్యం మత్తులో అర్ధరాత్రుల్లు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఇలాగే పీకలదాక తాగి అదే మత్తులో కారులో బయలుదేరిన యువకులు ఘోర ప్రమాదానికి గురయ్యారు. 

హైదరాబాద్ కు చెందిన కొందరు యువకుడు శనివారం ఫుల్లుగా మద్యం సేవించారు. ఇదే మత్తులో యువకులు అర్ధరాత్రి కారులో షికారులకు బయలుదేరారు. తాగిన మత్తులో కారును నడపలేని స్థితిలో వుండికూడా మితిమీరిన వేగంతో నడపసాగారు. దీంతో అదే వేగంతో దూసుకెళుతూ అదుపుతప్పిన కారు ఎల్బీనగర్ లో ప్రమాదానికి గురయ్యింది. 

ఎల్బీనగర్ అండర్ పాస్ లో వెళుతుండగా ఒక్కసారిగా కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ సమయంలో కారు అతివేగంతో వుండటంతో అమాంతం గాల్లోకి ఎగిరి పల్టీలు కొడుతూ బోల్తాపడింది. దీంతో కారులోని యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. 

hyderabad drunk driving accident

ఈ ప్రమాదం రాత్రి గస్తీలో వున్న పోలీసుల ఎదుటే జరిగింది. దీంతో వెంటనే పోలీసులు కారులోని యువకులను కాపాడి హాస్పిటల్ కు తరలించారు. కొందరు యువకులు తీవ్రంగా గాయపడగా మరికొందరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అందరికీ డాక్టర్ల చికిత్స అందిస్తున్నారు.

ట్రాఫిక్ అంతరాయం కలగకుండా రోడ్డుకు అడ్డంగా బోల్తాపడిన కారును వెంటనే పక్కకు జరిపారు. గాల్లో ఎగిరి బోల్తా పడటంతో కారు పూర్తిగా ధ్వంసమయ్యింది. 

ఇదిలావుంటే ఇటీవల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వనస్థలిపురంలో తాగుబోతులు వీరంగం సృష్టించారు. గతేడాదికి వీడ్కోలు చెబుతూ డిసెంబర్ 31న కొందరు యువకులు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో ఫుల్లుగా మద్యం సేవించిన యువకులు అదే మత్తులో కారులో వనస్థలిపురంలోని ఆంధ్ర కేసరి నగర్ లో మితిమీరిన వేగంతో చక్కర్లు కొట్టసాగారు. ఈ క్రమంలోనే ఓ అపార్ట్ మెంట్ వద్ద అదుపుతప్పిన కారు అతివేగంతో అపార్ట్ మెంట్ వైపు దూసుకెళ్లింది. అయితే అపార్ట్ మెంట్ గోడను ఢీకొట్టి పల్టీకొట్టి ఆగిపోయింది.  

అయితే ప్రమాదానికి కొన్నిక్షణాల ముందువరకు చిన్నారులు, మహిళలు అపార్ట్ మెంట్ ముందే సంబరాలు జరుపుకున్నారు. వారంతా అలా లోపలికి వెళ్లారో లేదో కారు ప్రమాదం జరిగింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. కారులోని యువకులు కూడా ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. 

 ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్ సిసి కెమెరాల్లో రికార్డయ్యింది. కారు ప్రమాదానికి గురయి బోల్లా పడ్డాక అందులోంచి యువకులు తాపీగా బయటకు వస్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో ఫుటేజి ఆదారంగా యువకులను గుర్తించిన పోలీసులు చర్యలు తీసుకున్నారు.

కాలనీలోని ఖాళీ స్థలంలో కొందరు యువకులు ప్రతిరోజూ మద్యం, గంజాయి తీసుకుంటున్నారని కాలనీవాసులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కాలనీవాసులు తెలిపారు. అప్పుడేచర్యలు తీసుకుని వుంటే ఈ ప్రమాదం జరిగివుండేది కాదని కాలనీవాసులు పేర్కొంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios