Hyderabad: రాచకొండ పోలీసులు భారీ మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 410 కిలోల కాంట్రాబ్యాండ్ గంజాను స్వాధీనం చేసుకోవడంతో పాటు పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Hyderabad: రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాల అక్రమ రవాణకు పాల్పడుతున్న ముగ్గురిని రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీరు ఇతర రాష్ట్రాలకు కూడా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. డ్రగ్స్ సరఫరాకు సంబంధించి పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన రాచకొండ-స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌ఓటీ)- ఎల్‌బీ నగర్ జోన్ బృందం.. కీసర పోలీసులతో కలిసి ముగ్గురు అంతర్‌రాష్ట్ర డ్రగ్స్ వ్యాపారులను పట్టుకున్నారు. నిందితులను గుడ్లనారం వెంకట్ నారాయణ అలియాస్ వెంకట్, దబ్బడి రజనీకాంత్, యాచహరం నాగరాజు లు గుర్తించారు. వీరి వద్ద నుంచి 410 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, రెండు కార్లు (టయోటా ఇన్నోవా & మహీంద్రా వెరిటో), మూడు మొబైల్ ఫోన్‌లు, రూ.1,02,30,000/- నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.
వీరిపై కీసర పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.
నిందితులు గుడ్లనారం వెంకట్ నారాయణ అలియాస్ వెంకట్ తుర్కయంజాల్ లోని ఏవీ నగర్ కు చెందిన వ్యక్తి. ఈ సిండికేట్ లో ప్రధాన నిందితుడు మండలి శ్రీనివాస్ బడంగ్‌పేట్ లోని గాంధీనగర్ లో నివాసముంటున్నాడు. ప్రస్తుతం ఇతన పరారీలో ఉన్నట్టు సమాచారం. ఉప్పల్ కు చెందిన దబ్బడి రజనీకాంత్, నల్గొండ జిల్లా చింతపల్లికి చెందిన యాచహరం నాగరాజు , గంజాయి సరఫరా దారు అయిన సతీ బాబు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ముంబైకి చెందిన షాహీన్ మరియు మజీద్ (గంజా రిసీవర్లు) కూడా పరారీలో ఉన్నారు.

నిందితుల నుంచి స్వాధీనం వస్తువుల వివరాలు ఇలా ఉన్నాయి..
1. నిషేధిత గంజాయి - 410 కిలోలు
2. టయోటా ఇన్నోవా కార్ Br. నం. AP29-BL-2299
3. మహీంద్రా వెరిటో కార్ Br. నం. TS-05-UB-5062
4. మొబైల్ ఫోన్లు- 03
నాగర్‌కర్నూల్ జిల్లా బైరాపూర్ గ్రామానికి చెందిన వెంకట్ నారాయణ ప్రస్తుతం తుర్కయంజాల్ లో నివాసముంటూ.. 2019 నుండి అక్రమ గంజాయి రవాణా వ్యాపారం సాగిస్తున్నాడు. అతను కర్నాటక, మహారాష్ట్ర నుండి గంజాయి కొనుగోలుదారులతో మంచి పరిచయాలను కలిగి ఉన్నాడు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు చెందిన నిరుపేద వినియోగదారులకు అధిక ధరకు విక్రయిస్తున్నాడు. ఈ కేసులో నిందితులు గా ఉన్న ఇతరులు అతని వద్ద నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణ చేస్తున్నారు.
