Asianet News TeluguAsianet News Telugu

కొంపముంచిన ఆన్ లైన్ షాపింగ్.. రూ.99 ఇయర్ ఫోన్స్ కొంటే.. రూ.33 లక్షలు మాయం... !!

8వ తరగతి చదువుతున్న కుమార్తె ఆన్లైన్ క్లాసులు  వినేందుకు హెడ్ ఫోన్లు కావాలని అడిగింది.  Online లో  కొంటానంటే ఫోన్ ఇచ్చింది.అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వాటి ధర రూ. 500 నుంచి రూ.600 వరకు ఉంది.  అయితే, ఓ వెబ్ సైట్ లో 99 రూపాయలకే ఇయర్ ఫోన్స్ అనే మెసేజ్ కనిపించడంతో అక్కడ కొనుగోలు చేసింది.  వారు  కొన్న వస్తువును జాగ్రత్తగా ఇంటికి తెచ్చి ఇచ్చారు.

Hyderabad : cyber hackers cheated woman of Rs 33 lakh over purchase of earphones on online
Author
Hyderabad, First Published Nov 23, 2021, 9:40 AM IST

హైదరాబాద్ :  ఏడాది కిందటే అనారోగ్యంతో భర్త మరణించాడు. వీరికి ముగ్గురు పిల్లలు.  భార్య నిరక్షరాస్యురాలు. భర్త చనిపోయేంతవరకు కాలు బయట పెట్టలేదు.  ఈ స్థితిలో ఆ కుటుంబానికి ఆయన Insurance money భరోసాను ఇచ్చాయి. దీంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతా సర్దుకుంటుంది అనుకున్న తరుణంలో రూ.99తో కొన్న Earphones ఆ కుటుంబాన్ని రోడ్డున పడేసాయి.  ఏకంగా రూ. 33 లక్షలు సైబర్ నేరగాళ్లు కొట్టేశారు.  ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఆఫర్తో ఆకర్షణకు గురై…
మౌలాలి లో ఉండే ఓ వ్యక్తి లేబర్ కాంట్రాక్టర్ గా పనిచేస్తుండేవాడు. గతేడాది నవంబర్లో అనారోగ్యంతో మరణించాడు. Insurance company నుంచి ఆయన కుటుంబానికి యాభై లక్షల రూపాయలు అందాయి.  ముగ్గురు పిల్లలపై తలా పది లక్షల చొప్పున భార్య Fixed deposit చేయించింది. తన దగ్గర ఉన్న మిగతా డబ్బులు 2 బ్యాంకు ఖాతాలో ఒక దాంట్లో 28 లక్షలు మరో ఖాతాలో ఐదు లక్షలు జమ చేసింది. అయితే,  8వ తరగతి చదువుతున్న కుమార్తె ఆన్లైన్ క్లాసులు  వినేందుకు హెడ్ ఫోన్లు కావాలని అడిగింది.  Online లో  కొంటానంటే ఫోన్ ఇచ్చింది.

అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో వాటి ధర రూ. 500 నుంచి రూ.600 వరకు ఉంది.  అయితే, ఓ వెబ్ సైట్ లో 99 రూపాయలకే ఇయర్ ఫోన్స్ అనే మెసేజ్ కనిపించడంతో అక్కడ కొనుగోలు చేసింది.  వారు  కొన్న వస్తువును జాగ్రత్తగా ఇంటికి తెచ్చి ఇచ్చారు.

హైదరాబాద్ లో ఘోర ప్రమాదం... పేలిన గ్యాస్ సిలిండర్, 11మందికి గాయాలు

వరుసగా 15 రోజుల్లో ఖాళీ..
కొన్ని రోజుల తర్వాత ఆమె మరి కొంత డబ్బులు జమ చేసేందుకు బ్యాంకుకి వెళ్ళింది. బ్యాలెన్స్ ఎంత ఉంది అని  ఎంక్వయిరీ చేస్తే  సున్నా ఉందని చెప్పారు.  ఐదు లక్షలు ఉండాలి కదా అని నిలదీస్తే... మాకేం తెలియదని సిబ్బంది వివరించారు. మరో ఖాతా పరిశీలనకు వేరే బ్యాంకు కి వెళ్లారు. ఇరవై ఎనిమిది లక్షలు ఉండాల్సిన accountలో రూపాయి కూడా లేదని తెలుసుకుని  షాక్ తిన్నారు.  వెంటనే రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.  బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలించగా,  ఆ రెండు ఖాతాలను ఖాళీ చేసేందుకు  Cyber ​​hackers కు 15 రోజులు పట్టినట్లుగా తేల్చారు.  ఆమె అవగాహన లేమి వారికి కలిసి వచ్చినట్లు గా గుర్తించారు.

 ఇలా కొల్లగొట్టారు…
ఇయర్ ఫోన్స్ కొన్నందుకు మీకు లాటరీ తగిలింది అని  ఆ వెబ్సైట్ నుంచి అశోక్ అనే వ్యక్తి కాల్ చేశాడు. రూ.15 లక్షల విలువచేసే కారును గెలుచుకున్నట్లు చెప్పాడు. కారు వద్దనుకుంటే డబ్బు తీసుకోవచ్చని నమ్మించాడు. ఎస్ఎంఎస్ లో ఉన్న link క్లిక్ చేసి బహుమతి డబ్బులు జమ చేసేందుకు బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయమని సూచించాడు.  ఆమె నిరక్షరాస్యులు కావడంతో ఫోన్ తన కుమార్తెకు ఇచ్చింది.  సైబర్ నేరస్తులు చెప్పినట్లుగా ఆ బాలిక Any desk app డౌన్లోడ్ చేసింది.  బ్యాంక్, డెబిట్ కార్డులు, ఓటిపి ఇతరత్రా వివరాలను చెప్పింది.  ఈ సమాచారంతో ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకుని ముందుగా ఫోన్ నెంబర్ మార్చేశారు. Google Pay, Phone Payను తమ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకుని పదుల సంఖ్యలో ఖాతాలకు డబ్బులను బదిలీ చేసినట్లు గుర్తించారు.  బీహార్ కేంద్రంగా ఇదంతా జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios