లిక్కర్ షాపుల వద్ద భారీ లైన్లు, పరిశీలించిన హైద్రాబాద్ సీపీ: భౌతిక దూరం పాటించేలా గుర్తులు
హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని సీపీ అంజనీకుమార్ బుధవారం నాడు పరిశీలించారు. మందు బాబులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకొన్నట్టుగా పోలీసులు చెప్పారు.
హైదరాబాద్: హైద్రాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని సీపీ అంజనీకుమార్ బుధవారం నాడు పరిశీలించారు. మందు బాబులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకొన్నట్టుగా పోలీసులు చెప్పారు.
హైద్రాబాద్ నగరంలోని నారాయణగూడలో మద్యం దుకాణాన్ని సీపీ అంజనీకుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
హైద్రాబాద్ కమిషనరేట్ పరిధిలో 178 మద్యం దుకాణాలు ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే మద్యం దుకాణాలు తెరవలేదు. ఇతర అన్ని జోన్లలో మద్యం దుకాణాలను ఓపెన్ చేశారు. మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించేలా ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేశారు. ఒకరి మరొకరికి మధ్య దూరం ఉండేలా దూరం ఉండేలా ఈ గుర్తులు ఏర్పాటు చేశారు. ఈ గుర్తుల్లోనే మద్యం కొనుగోలుకు వచ్చిన వారు నిలబడాల్సి ఉంటుంది.
also read:తెలంగాణలో తెరుచుకున్న వైన్ షాపులు: చాంతాడులా క్యూలు
భౌతిక దూరం పాటించకపోతే మద్యం దుకాణాలను మూసివేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మద్యం దుకాణాలు ఇవాళ ప్రారంభించడంతో ఉదయం నుండి మందుబాబులు క్యూలో నిలబడ్డారు.