హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మద్యం దుకాణాలు బుధవారం నాడు తెరుచుకొన్నాయి. మందుబాబులు ఉదయం 6 గంటల నుండే మద్యం షాపుల ముందు క్యూ లో నిల్చున్నారు. 

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం.హైద్రాబాద్ పట్టణంలోని తార్నాక, రామాంతాపూర్, మైలార్ దేవ్ పల్లి  వద్ద మద్యం దుకాణాల వద్ద ఉదయం పూటే క్యూ లైన్లలో నిల్చున్నారు. 

also read:తెలంగాణలో మద్యం ధరలు పెంపు: పెంచిన రేట్లు ఇవీ..

మధ్యాహ్నమైతే ఎండలకు తట్టుకోలేమని అందుకే ఉదయం పూట మద్యం కొనుగోలు కోసం వచ్చినట్టుగా కొందరు మందు బాబులు చెప్పారు. 
మద్యం దుకాణాల వద్దకు లేటుగా వస్తే మద్యం దొరుకుతుందో లేదోననే భయంతో కూడ ఉదయాన్నే వచ్చినట్టుగా మరికొందరు చెబుతున్నారు. 

ఇవాళ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకే మద్యం దుకాణాలను తెరిచి ఉంచనున్నారు. రాత్రి 7 గంటల నుండి కర్ప్యూ కొనసాగనుంది. 

మద్యం దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించకపోతే  మద్యం దుకాణాలను మూసివేస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. మరో వైపు మాస్కులు పెట్టుకోకుండా లిక్కర్ కోసం వెళ్తే మద్యం విక్రయాలు ఉండవని కేసీఆర్ తేల్చి చెప్పారు.

also read:https://telugu.asianetnews.com/telangana/liquor-prices-hike-telangana-raises-tax-on-alcohol-by-16--q9w7uj

మద్యం దుకాణాల్లో శానిటైజర్ తో పాటు ఇతర జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. మంగళవారం నాడు రాత్రి పూట మద్యం విక్రయాలు చేసుకోవాలని లిక్కర్ దుకాణాల యజమానులకు ఎక్సైజ్ శాఖ నుండి అనుమతి వచ్చింది.

కల్వకుర్తి, నాగర్ కర్నూల్, జడ్చర్ల, అచ్చంపేటలలోని మద్యం దుకాణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. లాక్ డౌన్ ఉన్న సమయంలో ఈ దుకాణాల నుండి స్టాక్ ను విక్రయించారా అనే అనుమానాలు కూడ లేకపోలేదు. ఈ విషయమై ఎక్సైజ్ ఉన్నతాధికారులు విచారణ జరపనున్నారు.