హైదరాబాద్: హైద్రాబాద్‌లో  డబ్బుతో పట్టుబడ్డ వ్యక్తులకు దుబ్బాక బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావుకు నేరుగా సంబంధాలు ఉన్నాయి హైద్రాబాద్ సీపీ అంజనీ కుమార్ తెలిపారు.

ఆదివారం నాడు సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడారు. హైద్రాబాద్ లో హవాలా మార్గంలో కోటికి పైగా నగదును దుబ్బాకకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు.

also read:హైద్రాబాద్‌లో హవాలా రాకెట్ గుట్టు రట్టు, కోటి స్వాధీనం: ఇద్దరి అరెస్ట్

ఇన్నోవా కారుతో పాటు ,రెండు సెల్ ఫోన్లను కూడ సీజ్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు. కారు డ్రైవర్ ను కూడ అరెస్ట్ చేశామన్నారు. ఫోన్ లో కీలక సమాచారాన్ని సేకరించామన్నారు.హైద్రాబాద్ బేగంపేట నుండి ఈ డబ్బును దుబ్బాకకు తరలిస్తుండగా సీజ్ చేశామన్నారు.

సురభి శ్రీనివాసరావుకు విశాఖ ఇండస్ట్రీస్ మేనేజర్ ద్వారా ఈ డబ్బులు ఇచ్చారని తమ విచారణలో తేలినట్టుగా సీపీ అంజనీకుమార్ చెప్పారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామన్నారు.. దుబ్బాకలో బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న రఘునందన్ రావుకు సురభి శ్రీనివాసరావు బావ మరిది అవుతారని సీపీ తెలిపారు.

సురభి శ్రీనివాసరావుతో పాాటు కారు డ్రైవర్ రవిని కూడ అరెస్ట్ చేశామని ఆయన చెప్పారు..రఘునందన్ రావుకి శ్రీనివాసరావు ఫోన్ చేసినట్టుగా తమ దర్యాప్తులో తేలిందని ఆయన వివరించారు.