హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలో భారీగా హవాలా డబ్బును ఆదివారం నాడు టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నగదును సీజ్ చేశారు.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు రాజకీయ పార్టీల నేతలు ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు రూ. కోటి రూపాయాల నగదును పోలీసులు సీజ్ చేశారు. 

నగదును తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ రాజకీయ పార్టీ నేతలు తమను దుబ్బాకకు తరలించారని సమాచారం అందించారని పట్టుబడినవారు పోలీసులకు సమాచారం అందించినట్టుగా తెలుస్తోంది.ఈ డబ్బులు ఎవరి నుండి ఎవరికి తరలిస్తున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

హవాలా మార్గంలో ఈ  డబ్బును తరలిస్తుండగా పోలీసులు సీజ్  చేశారు. ఈ నెల 3వ తేదీన దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి,ఈ ఉప ఎన్నికలను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.

గతంలో కూడ హైద్రాబాద్ లో హవాలా మార్గంలో డబ్బులు తరలిస్తుండగా పోలీసులు పట్టుకొన్నారు. దుబ్బాక ఎన్నికల షెడ్యూల్  విడుదల కావడానికి ముందే మేడ్చల్ పోలీసులు సుమారు. రూ. 45 లక్షలను సీజ్ చేశారు.