Asianet News TeluguAsianet News Telugu

సైదాబాద్ బాలికపై రేప్, హత్య: హైదరాబాద్ సీపీ ఉన్నత స్థాయి సమీక్ష.. నిందితుడి కోసం 100 మంది పోలీసులు

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోంది. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి క్రైమ్స్ అదనపు సీపీ, ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు హాజరయ్యారు. 

hyderabad cp anjani kumar high level review meeting on singareni colony girl murder case
Author
Hyderabad, First Published Sep 14, 2021, 5:16 PM IST

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి అత్యాచారం, హత్య కేసుపై ఉన్నత స్థాయి సమీక్ష జరుగుతోంది. హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతోంది. ఈ భేటీకి క్రైమ్స్ అదనపు సీపీ, ఈస్ట్ జోన్ జాయింట్ సీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీలు హాజరయ్యారు. నిందితుడి కోసం 100 మంది పోలీసులతో గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని పట్టుకునేందుకు మరో 10 బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

కాగా, సైదాబాదులోని సింగరేణి కాలనీలో పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటనలో పోలీసులు కొంత పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తన మిత్రుడితో రాజు కలిసి వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలకు చిక్కాయి. దాని ఆధారంగా రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Also Read:సింగరేణి కాలనీలో బాలికపై రేప్, హత్య: రాజుతో కలిసి మద్యం సేవించిన మిత్రుడు

పాపపై అత్యాచారం చేసి, హత్య చేసిన తర్వాత శవాన్ని ఇంటిలోనే పడేసి తాళం వేసి రాజు పారిపోయాడు. ఆ తర్వాత అతను తన మిత్రుడితో కలిసి మద్యం సేవించినట్లు పోలీసులు గుర్తించారు. దాంతోనే రాజు మిత్రుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం సేవించిన తర్వాత రాజు ఎటు వెళ్లాడనే విషయం తనకు తెలియదని అతని మిత్రుడు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. రాజు గతంలో ఓ చోరీకి కూడా పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాదులోని సైదాబాదులో గల సింగరేణి కాలనీలో పాపపై రాజు అత్యాచారం చేసి, ఆమెను చంపేసిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios