Asianet News TeluguAsianet News Telugu

నీ భార్య వీడియోలంటూ... అశ్లీల వీడియోలతో భర్తకు బ్లాక్ మెయిల్

అశ్లీల వీడియోలను పంపించి హైదరాబాద్ దంపతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదయ్యింది. డబ్బుల కోసం దంపతులను బెదిరిస్తున్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

hyderabad couple Black Mail With Videos akp
Author
Hyderabad, First Published Jul 25, 2021, 11:33 AM IST

జూబ్లీహిల్స్: నీ భార్య ప్రైవేట్ వీడియోలు అంటూ వాట్సాప్ లో అశ్లీల వీడియోలు పంపి తన భర్తను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఓ వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బులు ఇవ్వకుంటే అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తున్నారని సదరు మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని హైదరాబాద్  లో నివాసముండే ఓ జంట రియల్ ఎస్టేట్ అనుబంధ రంగంలో బిజినెస్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం ఓ నిర్మాణ పని కోసం కేరళకు చెందిన కార్మికులను నియమించుకున్నారు. అయితే రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు కార్మికులకు చెల్లింపులు చేయలేదు. డబ్బుల కోసం కేరళ కార్మికులు సదరు దంపతులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేకుండా పోయింది. 

read more  అఫైర్ అనుమానం: భార్యాకూతుళ్లను చంపేసిన దుర్మార్గుడు

ఈ క్రమంలో ఓ కార్మికుడు డబ్బుల కోసం దంపతులను బెదిరించడం ప్రారంభించాడు. అకౌంటెంట్ నుండి దంపతుల ఫోన్ నంబర్లు సేకరించిన అతడు అశ్లీల వీడియోలను పంపి బెదిరింపులకు దిగాడు. భర్తకు అశ్లీల వీడియోలు పంపి అది నీ భార్యదేనని... డబ్బులు ఇవ్వకుండే దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. 

ఇలా వీడియోలతో బ్లాక్ మెయిల్ చేయడంతో సదరు దంపతులు పోలీసులను ఆశ్రయించారు. వీరి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దంపతులను బ్లాక్ మెయిల్ చేస్తున్న బాధితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios