ఏసీబీ వలలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుధీర్ రెడ్డి ఏసీబీ అధికారుల వలలో చిక్కుకున్నాడు. గురువారం హైదరాబాద్ జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. 

ఈ దాడుల్లో జూబ్లి హిల్స్ ఎస్‌ఐ సుధీర్ రెడ్డి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ కేసులో ఓ ప్రముఖ వ్యాపారస్థుడికి  స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఎస్ఐ సుధీర్ రెడ్డి రూ.50వేలు డిమాండ్ చేసినట్టు ఏసీబీ దృష్టికి వచ్చింది. ఆ డబ్బుల కలెక్షన్ కోసం సుధీర్ రెడ్డి  తన సోదరుడి కొడుకుని మధ్యవర్తిగా నియమించాడు. 

AlsoRead ఈ ఏడాదే రాజయోగం: కేటీఆర్ దైవదర్శనాలకు కారణమదే.

ఏసీబీ అధికారులు వలవేసి ఎస్ఐ సుధీర్ రెడ్డి, అతడి అన్న కొడుకు ఇద్దరినీ పట్టుకున్నారు.  అయితే..  తనపై అధికారి సీఐ బల్వంతయ్య చేసిన ఒత్తిడి మేరకే తాను లంచం తీసుకున్నట్లు సుధీర్ రెడ్డి చెప్పడం గమనార్హం. 

 ప్రస్తుతం సీఐ బల్వంతయ్య  పరారీలో ఉన్నారని పేర్కొన్నారు. సిఐ బల్వంతయ్యను కూడా విచారణ చేస్తామని  ఏసీబీ అధికారులు చెప్పారు. 2019 డిసెంబర్‌ 29న ఓ కేసులో స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు లోక్‌ అదాలత్‌లో సెటిల్‌ చేస్తానంటూ సుధీర్‌ రెడ్డి హామీ ఇచ్చి.. లక్ష రూపాయలు డిమాండ్‌ చేశారని తెలిపారు. రూ. 50వేలు తీసుకుంటుండగా జూబ్లీహిల్స్‌లోని ఓ హోటల్‌లో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నామని, డబ్బుతో పాటు రెండు లిక్కర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ వెల్లడించారు