Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: మల్లు రవికి పోలీసుల నోటీసులు

కాంగ్రెస్ పార్టీ సీనియర్  నేత మల్లురవికి  సికింద్రాబాద్  పోలీసులు  శనివారం నాడు  నోటీసులు జారీ చేశారు.  కాంగ్రెస్ వార్ రూమ్  కేసుకు సంబంధించి  పోలీసులు నోటీసులిచ్చారు.  
 

  Hyderabad  CCS  Police  Serves  Notice  To  Congress Senior Leader  Mallu Ravi
Author
First Published Feb 4, 2023, 3:10 PM IST


హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవికి  సికింద్రాబాద్  పోలీసులు శనివారం నాడు  నోటీసులు జారీ చేశారు. ఈ నెల  8వ తేదీన  విచారణకు రావాలని ఆ నోటీసులో  పోలీసులు  పేర్కొన్నారు.  సీఎం కేసీఆర్  ఫోటో మార్పింగ్  చేశారని  అందిన ఫిర్యాదు మేరకు  పోలీసులు  నోటీసులు  జారీ చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో  మల్లు రవికి  నోటీసులు అందించారు.  కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో  ఈ ఏడాది జనవరి  18వ తేదీన  మల్లు రవి  సైబర్ క్రైమ్  పోలీసుల విచారణకు  హాజరైన విషయం తెలిసిందే .

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో  ఈ ఏడాది  జనవరి  9వ తేదీన  సైబర్ క్రైమ్  పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనవరి  12న విచారణకు రావాలని కోరారు. అయితే  సంక్రాంతి పర్వదినం నేపథ్యంలో  జనవరి  12న కాకుండా  మరో రోజున విచారణకు  వస్తానని  మల్లు రవి  సీసీఎస్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో  జనవరి  19న  సీసీఎస్  పోలీసులు  మల్లు రవిని  సుమారు మూడు గంటల పాటు  విచారించారు.  

also read:కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: మల్లు రవిని విచారించిన సీసీఎస్ పోలీసులు

2022 డిసెంబర్  13వ తేదీన  హైద్రాబాద్ మాదాపూర్ లో  కాంగ్రెస్ వార్ రూమ్ పై సైబర్ క్రైమ్ పోలీసులు దాడులు నిర్వహించారు.  సోషల్ మీడియాలో  తెలంగాణ సీఎం  కేసీఆర్  తో   పాటు  అనుచిత పోస్టులకు సంబంధించి  అందిన ఫిర్యాదుల మేరకు  పోలీసులు  సోదాలు  చేశారు.   కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్  కనుగోలు టీమ్ సభ్యులకు  పోలీసులు  నోటీసులు ఇచ్చారు.  అయితే  ఈ నోటీసులపై   విచారణకు  హాజరైన  సునీల్  కనుగోలు  కాంగ్రెస్ వార్ రూమ్ కు  తనకు సంబంధం లేదని  తేల్చి చెప్పాడు.  కాంగ్రెస్ వార్ రూమ్ కు తాను ఇంచార్జీనని  కాంగ్రెస్ నేత మల్లు రవి  సైబర్ క్రైమ్  పోలీసులకు  లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా  సీసీఎస్  పోలీసులు  గత నెల  18న మల్లు రవిని  విచారణకు  పిలిచారు.తాజాగా మల్లు రవికి  సికింద్రాబాద్ పోలీసులు  నోటీసులు జారీ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios