కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: మల్లు రవిని విచారించిన సీసీఎస్ పోలీసులు

కాంగ్రెస్ వార్ రూమ్  కేసులో  కాంగ్రెస్ నేత మల్లు రవిని సీసీఎస్ పోలీసులు విచారించారు.  సీసీఎస్  పోలీసులు  మల్లు రవిని సుమారు మూడు గంటల పాటు  విచారించారు. 
 

Congress war room Case: CCS  Police  Completes  Congress Leader  Mallu Ravi  probe

హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత  మల్లు రవిని సైబర్ క్రైమ్ పోలీసుల  విచారణ ముగిసింది.  కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో బుధవారంనాడు ఉదయం  మల్లు రవి  సైబర్ క్రైమ్ (సీసీఎస్)  పోలీసుల ఎదుట  హాజరయ్యారు మల్లు రవి.సుమారు మూడు గంటల పాటు  సీసీఎస్ పోలీసులు మల్లు రవిని విచారించారు. 

సీసీఎస్ పోలీసుల విచారణ ముగిసిన తర్వాత ఇవాళ మల్లు రవి  మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ వార్ రూమ్ ద్వారా పోస్టు అవుతున్న వీడియోలకు తాను బాధ్యుడినని మల్లు రవి చెప్పారు. కాంగ్రెస్ వార్ రూమ్ కు  తాను ఇంచార్జీగా ఉన్నట్టుగా ఆయన  చెప్పారు. సామాన్య ప్రజలకు  అర్ధమయ్యే రీతిలో  సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నామన్నారు. సునీల్ కనుగోలు విషయమై కూడా తనను ప్రశ్నించారన్నారు. సునీల్ కనుగోలుకు  కాంగ్రెస్ వార్ రూమ్ తో  సంబంధం లేదని  చెప్పానన్నారు.  అవసరమైతే మళ్లీ విచారణకు పిలిస్తే రావాలని పోలీసులు చెప్పారన్నారు.

కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో  విచారణకు రావాలని  మల్లు రవికి ఈ నెల  9వ తేదీన సీసీఎస్ పోలీసులు  నోటీసులుజారీ చేశారు. 41 ఏ సీఆర్‌పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారు. అదే రోజున  కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు కూడా  సీసీఎస్ పోలీసుల విచారణకు హాజరయ్యారు.  సునీల్ కనుగోలు విచారణ పూర్తైన తర్వాత  పోలీసులు మల్లు రవికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల  12న విచారణకు రావాలని ఆ నోటీసులో  సీసీఎస్ పోలీసులు కోరారు. అయితే  ఈ నెల  12న విచారణకు రావడం సాద్యం కాదని మల్లు రవి  సీసీఎస్ పోలీసులకు  చెప్పారు.  

also read:కాంగ్రెస్ వార్ రూమ్ కేసు: సైబర్ క్రైమ్ పోలీసుల విచారణకు హాజరైన మల్లు రవి

మరో రోజున విచారణకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో  ఇవాళ  సీసీఎస్ పోలీసుల విచారణకు మల్లు రవి హాజరయ్యారు.2022 డిసెంబర్  13వ తేదీన హైద్రాబాద్ మాదాపూర్ లో గల   కాంగ్రెస్ వార్ రూమ్ లో 
సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ సహా బీఆర్ఎస్ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే అందిన ఫిర్యాదుల ఆధారంగా  పోలీసులు సోదాలు చేశారు.మరో వైపు  ఈ విషయమై సునీల్ కనుగోలుకు  కూడా సీసీఎస్ పోలీసులు  41 ఏ సీఆర్ పీసీ కింద నోటీసులు జారీ చేశారు.  ఈ నోటీసులపై  స్టే కోరుతూ సునీల్ కనుగోలు  దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు స్టే ఇచ్చేందుకు  నిరాకరించింది.  

 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios