Asianet News TeluguAsianet News Telugu

బంజారాహిల్స్‌ వ్యాపారికి టోకరా .. రూ.579 కోట్ల కాంట్రాక్టు..రూ.3 కోట్లు స్వాహా

బంజారాహిల్స్‌ వ్యాపారికి టోకరా వేసింది ఓ ముఠా. నకిలీ లెటర్ చూపించి.. రూ.579 కోట్ల డబుల్‌ బెడ్‌రూమ్‌ పనులు, మరో సబ్‌–కాంట్రాక్ట్‌కు ఇస్తామంటూ రూ.3 కోట్లు స్వ‌హా చేశారు న‌కిలీ ముఠా. తీరా అస‌లు విష‌యం తెలుసుకున్న బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. 
 

hyderabad ccs police file cheating case rs 3 crores
Author
Hyderabad, First Published Jan 27, 2022, 11:59 AM IST

తెలంగాణ ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూమ్ ఇండ్ల‌తో పాటు మరో లిమిటెడ్‌ సంస్థకు చెందిన పనులు ఇప్పిస్తామంటూ బంజారాహిల్స్‌ వ్యాపారికి టోకరా వేసింది ఓ ముఠా. నకిలీ లెటర్ చూపించి.. రూ.579 కోట్ల డబుల్‌ బెడ్‌రూమ్‌ పనులు, మరో సబ్‌–కాంట్రాక్ట్‌కు ఇస్తామంటూ రూ.3 కోట్లు స్వ‌హా చేశారు న‌కిలీ ముఠా. తీరా అస‌లు విష‌యం తెలుసుకున్న బాధితుడు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. 

వివ‌రాల్లోకెళ్తే.. బంజారాహిల్స్ కు  చెందిన సివిల్‌ ఇంజినీర్‌ కె.జగదీశ్వర్‌ దాదాపు పదహారేళ్లుగా సాయిడక్స్‌ ఇంజినీర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ అనే  సంస్థ నిర్వహిస్తున్నారు. గతేడాది సెప్టెంబర్‌ 21న శివప్రసాద్‌ అనే బ్రోక‌ర్ ద్వారా.. జ‌గ‌దీశ్వ‌ర్ కు  డీఎన్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.నరేష్‌ చౌదరి ప‌రిచ‌య‌మ్యాడు. ఇక‌ త‌రుచు కలుసుకునే వాళ్లు. ఈ క్ర‌మంలో డి.నరేష్‌ చౌదరి.. 
మహానంది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్ కు సంబంధించిన రూ.539 కోట్ల కాంట్రాక్టుకు  లెటర్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ చూపించారు. ఆ కాంట్రాక్టు తనకే వచ్చిందంటూ సివిల్‌ ఇంజినీర్‌ కె.జగదీశ్వర్ ను నమ్మబలికాడు.

అలాగే.. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించిన రూ.40 కోట్ల కాంట్రాక్టునూ సబ్‌–కాంట్రాక్టు కూడా  ఇస్తానంటూ న‌మ్మ‌బ‌లికాడు. ఈ క్ర‌మంలో జగదీశ్వర్, నరేష్‌లు ఒప్పందం జ‌రిగింది. ఆ తర్వాత డి.నరేష్‌ చౌదరి నుంచి జగదీశ్వర్‌కు సంబంధం లేని పనులకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఇదేమిటని ప్ర‌శ్నించ‌గా.. జీఎస్టీ స‌మ‌స్య అని చెప్పుకోచ్చాడు.

 అనంత‌రం.. ప్రాజెక్టు ప్రారంభం చేస్తామంటూ..  ఖర్చుల నిమిత్తం రూ.1.4 కోట్లు తీసుకున్నాడు. ఈ స‌మ‌యంలో నరేష్‌తో పాటు ఆయ‌న భార్య లావణ్య, బంధువులు రాకేష్, చైతన్య వచ్చారు. మ‌రో వారం త‌రువాత‌.. సరుకు సరఫరా కోసం..  ఉమా ఇంటర్నేషనల్‌ ట్రేండింగ్‌ కంపెనీకి రూ.50 లక్షలు, ఏకదంత రిటైలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్ కు రూ.1.1 కోట్లు చొప్పున నగదు, పర్చేజ్‌ ఆర్డర్లు ఇప్పించాడు. ఈ చెల్లింపుల తర్వాత జగదీశ్వర్‌కు ఎలాంటి సరుకు సరఫరా కాలేదు. వారం రోజులు అయినా.. వారి నుంచి స‌రైన స‌మాధానం రాక‌పోవ‌డంతో.. జ‌గ‌దీశ్వ‌ర్  సబ్‌–కాంట్రాక్టులు, నగదు విషయ‌మై..నరేష్ చౌద‌రిని  సంప్రదించారు. కానీ అతడు కూడా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గ్ర‌హించారు.

దీంతో అస‌లు ఆరా తీయగా... నరేష్‌ నేతృత్వంలోని ముఠా చేతిలో.. త‌న త‌ర‌హాలో అనేక మందిని మోసం పోయార‌ని తెలిపింది.  దీంతో ఆయన సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో నరేష్, లావణ్య, రాకేష్, స్వాతి, చైతన్య, శివప్రసాద్‌లతో పాటు ఉమా ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ కంపెనీ, ఏకదంత రిటైలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us:
Download App:
  • android
  • ios