Asianet News TeluguAsianet News Telugu

బీజేపీ పేద‌ల వ్య‌తిరేక పార్టీ .. అన్ని రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ప‌నిచేస్తుంది : ఎమ్మెల్సీ క‌విత

Hyderabad: కేంద్రానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) ఆధ్వర్యంలోని పీఎస్‌యూలను ( ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు) ప్ర‌యివేటీకరించడంపై భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. బీజేపీ పేద‌ల వ్య‌తిరేక పార్టీ అని ఆమె ఆరోపించారు. 
 

Hyderabad : BJP is an anti-poor party, BRS works in all states: MLC Kavita
Author
First Published Jan 22, 2023, 11:54 PM IST

BRS MLC Kavitha Kalvakuntla: ప్రతి రాష్ట్రంలో భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్‌ఎస్) పని చేస్తుంద‌ని ఆ పార్టీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత తెలిపారు. అలాగే, కేంద్రంలోని బీజేపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించిన ఆమె.. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ, అది కార్పొరేట్ల‌కు అనుకూలంగా ప‌నిచేస్తుంద‌ని ఆరోపించారు. సింగరేణి కార్మికులకు సాధికారత కల్పించేందుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్ రావు (కేసీఆర్) చేస్తున్న కృషిని ఆమె కొనియాడారు. బొగ్గు క్షేత్రాలను ప్ర‌యివేటీక‌రించ‌డం ద్వారా  యూనియన్‌ను చీల్చి ఇబ్బందుల‌కు గురిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంద‌ని సింగ‌రేణి కార్మికుల అంశాల‌ను ప్ర‌స్తావించారు.

వివ‌రాల్లోకెళ్తే.. భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,  కేంద్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) పై మ‌రోసారి విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ.. కార్పొరేట్ ల‌కు  అనుకూలంగా ప‌నిచేస్తుంద‌ని ఆరోపించారు. సింగరేణి కార్మిక సంఘం పరిరక్షణ, సాధికారత కోసం తమ పార్టీ కృషి చేసిందని తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు (కేసీఆర్) కుమార్తె కవిత అన్నారు. అలాగే, తెలంగాణ సీఎం కేసీఆర్ సింగ‌రేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుని వారికి సాధికారత కల్పించారని చెప్పారు. 

భూపాలపల్లి పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో క‌విత మాట్లాడుతూ.. కేంద్రంలో వెనుకబడిన వర్గాలకు మంత్రిత్వ శాఖ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ (డీఐపీఏఎం) ఆధ్వర్యంలోని పీఎస్‌యూలను ( ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు) ప్ర‌యివేటీకరించడంపై భార‌త రాష్ట్ర స‌మితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సింగరేణి కార్మికులకు సాధికారత కల్పించేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని కొనియాడిన కవిత.. బొగ్గు క్షేత్రాలను ప్ర‌యివేటీక‌రించ‌డం ద్వారా యూనియన్‌ను చీల్చి ఇబ్బందుల‌కు గురిచేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.  ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల‌ను (పీఎస్ యూలు) ప్ర‌యివేటీకరించ‌డం వ‌ల్ల‌ ప్రస్తుతం ఉపాంత వర్గాలు నష్టపోతున్నాయని ఆమె అన్నారు.

సీఎం కేసీఆర్ కృషి వల్లే నేడు సింగరేణి కార్మికులు కోల్‌ ఇండియా కంటే ఎక్కువ లబ్ధి పొందారని, సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అన్ని చర్యల వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవడమే కాకుండా ఎంతో మందికి ఉపాధి భరోసా కల్పించిందని ఎమ్మెల్సీ క‌విత అన్నారు. సింగరేణి కార్మికులు ఐక్యంగా తమ జీవనోపాధిపై దాడికి ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా గళం విప్పాలని కోరారు. అలాగే, దేశ రాజ‌కీయాల్లోకి అడుగుపెట్ట‌డానికి భార‌త రాష్ట్ర  స‌మితిగా పేరుమార్చుకున్న త‌మ పార్టీ గురించి క‌విత మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ పార్టీ ప్రతి రాష్ట్రంలోనూ పని చేస్తుంద‌ని తెలిపారు. అలాగే, అన్ని రాష్ట్రల‌ వ్యాప్తంగా యూనియన్‌ను బలోపేతం చేస్తామన్నారు. 

రామ‌ప్ప ఆల‌యంలో క‌విత‌ ప్ర‌త్యేక పూజ‌లు..

తెలంగాణలోని ఐక్యరాజ్యసమితి విద్యా, వైజ్ఞానిక-సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం సందర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. "యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఉన్న చారిత్రాత్మక-మహిమాన్వితమైన రామప్ప ఆలయాన్ని సందర్శించి.. పూజలు నిర్వ‌హించిన‌ట్టు తెలిపారు. మన అద్భుతమైన చరిత్ర-సంప్రదాయాల గురించి వినడానికి- ఆయా విష‌యాల‌ను జరుపుకోవడానికి ఎల్లప్పుడూ గౌరవంగా ఉంటుంద‌ని తెలిపారు. కాగా, జూన్ 2021లో, UNESCO కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆల‌యాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

Follow Us:
Download App:
  • android
  • ios