Hyderebad: జీవితంపై విసుగు.. హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం మానేసి కూలీ అవతారం
హైదరాబాద్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఓ యువకుడు తన లైఫ్‌పై అసంతృప్తి చెందాడు. ఉద్యోగం మానేసి ఎవరికీ చెప్పకుండా ఓ పండ్ల మార్కెట్‌లో సరుకులు మోసే కూలీగా అవతారమెత్తాడు. కుటుంబం మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. గతంలోనూ తమ కొడుకు చెప్పాపెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయాడని కీలక క్లూ ఇచ్చారు.
హైదరాబాద్: లైఫ్ మెకానికల్‌గా తయారైంది. జీవితమంతా బోరింగ్‌గా మారింది. ఇలా చాలా మంది (ముఖ్యంగా ఉద్యోగస్తులు) అంటూ ఉంటారు. అయితే, వారికి దొరికిన సమయంలోనే కొంత ఉల్లాసం కోసం వ్యాపకాలు, మిత్రులతో కలయిక, ఇతర పనులు చేసి ఆ ఫేజ్ నుంచి బయటకు వస్తారు. కానీ, హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ మాత్రం ఇందుకు విరుద్ధం. ఎంత హోదా గల జాబ్ అనేది కాదు.. తన మనసుకు సంతృప్తి ముఖ్యం అని భావించాడేమో.. ఉద్యోగాన్ని ఉన్నపళంగా వదిలేసి ఎవరికీ చెప్పాపెట్టుకుండా కనిపించకుండా పోయాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాన్ని వదిలి ఓ పండ్ల మార్కెట్‌లో కూలీ అవతారమెత్తాడు.
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న యువకుడు ఏప్రిల్ 7వ తేదీన కనిపించకుండా పోయాడు. ఆయన ఉంటున్న హాస్టల్‌లోనూ కనిపించలేదు. బహుశా ఖమ్మంలోని తన సొంతూరికి వెళ్లి ఉంటాడని కాలేజీ సిబ్బంది భావించారు. ఆ యువకుడి ఇంటికి ఫోన్ చేశారు. తమ కొడుకు ఇంటికి రాలేడని వారు కాలేజీ అధికారులకు చెప్పారు.
కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తమ కొడుకు అదృశ్యమయ్యాడని కంప్లైంట్ ఇచ్చారు. ఇక్కడే పోలీసులకు వారు ఒక ముఖ్యమైన క్లూ ఇచ్చారు. గతంలోనూ తమ కొడుకు ఇంట్లో చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడని, అప్పుడు ఓ మార్కెట్‌లో కూలీ అవతారమెత్తి సరుకులను మోశాడని వివరించారు.
Also Read: హెల్మెట్ ఎక్కడుంది? పోలీసులను బైక్ పై వెంటాడిన ఇద్దరు మహిళలు.. వీడియో వైరల్
దీంతో పోలీసులు ఆ కోణంలో ఆలో చించారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లోని ఓ పండ్ల మార్కెట్ పై అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ సునీల్ కుమార్, ఆయన బృందం ఓ కన్నేసి ఉంచారు. మంగళవారం ఉదయం ఓ యువ కుడు అక్కడ కూలీగా పని చేయడానికి రావడాన్ని గుర్తించారు. వెంటనే ఆ యువకుడిని అదుపు లోకి తీసుకుని కుటుంబానికి అప్పగించారు. ఆయనకు కౌన్సెలింగ్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేయాలని కుటుంబానికి పోలీసులు సూచించారు.