Asianet News TeluguAsianet News Telugu

ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యం.. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనాలు !

Hyderabad: మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. సిటీ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని అధికార‌ పార్టీ నేతలు నిర్ణయించారు. మునుగోడు ఉప ఎన్నిక‌ల గెలుపులో ఆత్మీయ స‌మ్మేళ‌నాలు గ‌ట్టిగానే ప్ర‌భావం చూపాయి.
 

Hyderabad : Aiming to win the elections.. TRS Atmeeya Sammelans in all assembly constituencies of the state
Author
First Published Nov 23, 2022, 5:58 AM IST

TRS-Atmiya Sammelana: మునుగోడు ఉపఎన్నిక సంద‌ర్భంగా అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర స‌మితి (టీఆర్ఎస్‌).. ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించింది. ఇవి ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెలుపులో గ‌ట్టినే ప్ర‌భావం చూపాయి. ఇదే త‌ర‌హా ట్రెండ్ రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగించాల‌ని టీఆర్ఎస్ ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. ఆత్మీయ స‌మ్మేళ‌నాలు నిర్వ‌హించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్న‌ద‌ని స‌మాచారం. 

వివ‌రాల్లోకెళ్తే.. మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న ట్రెండ్‌ను కొనసాగిస్తూ.. సిటీ అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలు చేపట్టాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. శాసనసభ, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య‌మంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) తమ నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనాలను కొనసాగించాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. ఈ సమావేశాలు పార్టీ కార్యకర్తలు, నాయకులతో సన్నిహితంగా ఉండటమే కాకుండా నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి కూడా దోహదపడతాయని పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో అనుసరించిన విజయవంతమైన యంత్రాంగం ఇది కావ‌డంతో ఇలాంటి ప‌నులు ముందు రానున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు అవ‌కాశాల‌ను మ‌రింత‌గా మెరుగుప‌రుస్తుంద‌ని పార్టీ నాయ‌క‌త్వం భావిస్తున్న‌ద‌ని స‌మాచారం. 

రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ సమావేశాలు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గ్రామీణ నియోజకవర్గాల్లో ఒకేసారి రెండు మండలాలను తీసుకుని సమావేశాలు నిర్వహించనున్న‌ట్టు తెలిసింది. పగటిపూట జరిగే సమావేశానికి సంబంధిత ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జి హాజరవుతారనీ, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సంభాషిస్తారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపిన‌ట్టు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. ప్రాధాన్యతా ప్రాతిపదికన ఏదైనా ప్రధాన సమస్య ఉందా అని కూడా ఎమ్మెల్యేలు ప్రశ్నలు అడుగుతారు. “వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ సమావేశాలు క్రమం తప్పకుండా జరుగుతాయి” అని టీఆర్ఎస్ ఒక‌రు నాయకుడు చెప్పారు. కొంతమంది నాయకులు ఇప్పటికే కొన్ని సెగ్మెంట్లలో ఈ సమావేశాలను ప్రారంభించారని తెలిపారు.

నగరంలో జరిగే ఆత్మీయ సమ్మేళనాలకు సంబంధించి పార్టీ నాయకులు ప్రతి ఆరు నుంచి ఏడు వార్డులకు ఒక సమావేశం నిర్వహిస్తారు. కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు నవంబర్ 27న సర్వసభ్య సమావేశం జరగనుంది. హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

కాగా, కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజకీయ కక్షతో కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నదని బీజేపీపై మంత్రి తలసాని మండిపడ్డారు. "కేంద్ర ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తోంది. వారి తాటాకు చప్పుళ్ల కు భయపడేదిలేదు. ఏమైనా కూడా ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం" అని పేర్కొన్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios