ప్రపంచాన్ని వణికించిన ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్  కొడుకు  హంజా బిన్ లాడెన్ పెళ్లి చేసుకొన్నాడు. ఈ విషయాన్ని లాడెన్ కుటుంబం ప్రకటించింది. 

న్యూయార్క్: ప్రపంచాన్ని వణికించిన ఆల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా బిన్ లాడెన్ పెళ్లి చేసుకొన్నాడు. ఈ విషయాన్ని లాడెన్ కుటుంబం ప్రకటించింది. ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడెన్ కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ప్రకటించారు.

9/11 దాడులకు నేతృత్వం వహించిన మహ్మద్‌ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నట్లు లాడెన్ కుటుంబసభ్యులు ప్రకటించారు. ఆల్‌ఖైదాలో హంజాకు స్థానం దక్కిందని కుటుంబసభ్యులు చెప్పారు. 

తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు హంజా సిద్దమౌతున్నారని కుటుంబసభ్యులు ప్రకటించారు. హంజాతో తమకు ప్రత్యక్ష సంబంధాలు లేవన్నారు. అయితే ఆల్ ఖైదా ద్వారా ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగొద్దని హంజానుకోరారు.

ఆల్‌ఖైదా పునర్నిర్మాణంలో హంజా కీలకంగా వ్యవహరిస్తున్నారని ఇంటలిజెన్స్ ఏజెన్సీలు అభిప్రాయపడుతున్నాయి. హంజా ఆచూకీని తెలుసుకొనేందుకు ఇంటలిజెన్స్ సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. హంజా ఆఫ్ఘనిస్తాన్ లో ఉంటున్నట్టు తమకు సమాచారం ఉందని లాడెన్ కుటుంబసభ్యులు తెలిపారు.

బిన్ లాడెన్ తో కూడ తమకు సంబంధాలు ఉండేవని కావన్నారు. 1999 నుండి 2011 వరకు ఒక్కసారి కూడ లాడెన్ తమను కలవలేదన్నారు.2017 జనవరిలో హంజా బిన్‌ లాడెన్‌ను అమెరికా గ్లోబల్‌ టెర్రరిస్టుగా ప్రకటించింది.