జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటపై హెచ్ సీ ఏకి నోటీసిలిస్తాం: హైద్రాబాద్ అడిషనల్ సీపీ చౌహన్
జింఖానా గ్రౌండ్స్ తొక్కిసలాటపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. ఈ విషయమై హెచ్ సీ ఏ కి నోటీసులు ఇస్తామని హైద్రాబాద్ అడిషనల్ సీపీ చౌహన్ చెప్పారు. హెచ్ సీ ఏ సరైన ఏర్పాట్లు కూడా చేయలేదన్నారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాటలో ఎవరూ మరణించలేదని అడిషనల్ సీపీ చౌహన్ ప్రకటించారు.గురువారం నాడు ఆయన జింఖానా గ్రౌండ్స్ వద్ద మీడియాతో మాట్లాడారు. క్రికెట్ మ్యాచ్ టికెట్ల విక్రయాన్ని పురస్కరించుకొని హెచ్ సీఏ ఎలాంటి ఏర్పాట్లు చేయలేదన్నారు.తొక్కిసలాటలో గాయపడిన వారిని సికంద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించినట్టుగా ఆయన చెప్పారు. టికెట్ల విక్రయానికి సంబంధించి హెచ్ సీ ఏ కనీస సౌకర్యాలు ఏర్పాట్లు చేస్తే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. తొక్కిసలాటకు కారణమైన హెచ్ సీ ఏకు నోటీసులు ఇస్తామని అడిషనల్ సీపీ చౌహాన్ చెప్పారు. జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల విక్రయానికి సంబంధించి సరైన కౌంటర్లు కూడా ఏర్పాటు చేయలేదన్నారు.తమ శాఖతో సమన్వయం కూడా చేసుకోలేదని ఆయన తెలిపారు.
also read:జింఖానా గ్రౌండ్స్ లో తొక్కిసలాటపై తెలంగాణ సర్కార్ సీరియస్: వివరణ ఇవ్వాలని హెచ్ సీఏకు ఆదేశం
ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో ఇండియా, అస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ ఉంది.ఈ క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టికెట్ల కోసం నాలుగైదు రోజులుగా క్రికెట్ అభిమానులు తిరుగుతున్నారు. ఈ నెల 15 నుండి టికెట్ల విక్రయం చేస్తామని హెచ్ సీ ఏ ప్రకటించింది. ఈ నెల 15న ఆన్ లైన్ లో టికెట్ల విక్రయం చేపట్టిన కొద్దిసేపటికే టికెట్ల విక్రయం ముగిసిందని ప్రకటించారు. దీంతో ఆఫ్ లైన్ టికెట్ల కోసం నాలుగైదు రోజులుగా టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్, హెచ్ సీ ఏ కార్యాలయాలకు పెద్ద ఎత్తున అభిమానులు వస్తున్నారు. అయితే ఇవాళ టికెట్లను విక్రయించనున్నట్టుగా హెచ్ సీ ఏ ప్రకటించింది. టికెట్లను కొనుగోలు చేసేందుకు నిన్న రాత్రి నుండి జింఖానా గ్రౌండ్స్ వద్దే పెద్ద ఎత్తున అభిమానులు క్యూ కట్టారు. ఇవాళ ఉదయం టికెట్ కౌంటర్ ఓపెన్ చేసిన గంటన్నర తర్వాత కూడ ఒక్క టికెట్ కూడా విక్రయించలేదు. సాంకేతిక సమస్యలను హెచ్ సీ ఏ వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో వర్షం పడడం ఒక్కసారిగా క్రికెట్ అభిమానులు గేటు వైపునకు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.