హైదరాబాద్‌లో (Hyderabad) ఓ బాలుడు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. పాల ప్యాకెట్ తీసుకురావడానికి వెళ్లిన బాలుడు అదృశ్యం అయ్యాడు. ఈ ఘటన నగరంలోని నల్లకుంటలో చోటుచేసకుంది. 

హైదరాబాద్‌లో (Hyderabad) ఓ బాలుడు అదృశ్యం కావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన నగరంలోని నల్లకుంటలో చోటుచేసకుంది. వివరాలు.. నల్లకుంటకు చెందిన కార్తీక్ కుమార్ రోజు మాదిరిగానే పాల పాకెట్ తీసుకురావడానికి బయటకు వెళ్లాడు. అయితే ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. వెంటనే సమీప ప్రాంతంలో బాలుడి కోసం గాలింపు చేపట్టారు. అయినప్పటికీ బాలుడి జాడ తెలియకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

దీంతో కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాలుడు ఇంటి పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్ గండిపేట మండలం హైదర్షాకోట్ లోని Kasturba Gandhi national memorial Trust నుంచి 14 మంది women శుక్రవారం అర్థరాత్రి పరారయ్యారు. నార్సింగి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని వివిధ పరిధిలో పట్టుబడిన యువతులు, మహిళలను పోలీసులు కస్తూర్బాగాంధీ స్మారక ట్రస్టులో చేర్చుతారు. భద్రత మధ్య ఒక hall లో 18 మందిని ఉంచారు. 

శుక్రవారం తెల్లవారుజామున 2గం.ల సమయంలో bathroomలో కిటికీ ఊచలు కట్ చేసి 15 మంది పారిపోయేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఒక యువతికి స్వల్పగాయం కావడంతో అక్కడే ఉండిపోయింది. మిగిలిన 14మంది పరారయ్యారు. ఉదయం గుర్తించిన మేనేజర్లు రామకృష్ణమూర్తి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో బెంగాల్, మహారాష్ట్రలకు చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. రెండు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అడ్మిన్ ఎస్ఐ రవీందర్ తెలిపారు.