కడుపులో ఉన్న బిడ్డ కు లైంగిక నిర్దారణ పరీక్షలు చేయడం మనదేశంలో నేరం అన్న విషయం అందరికీ తెలిసిందే. అయినప్పటికీ.. చాలా మంది లైంగిక నిర్దారణ పరీక్షలు చేస్తుండటం విశేషం. కాగా... అలా గుట్టుచప్పుడు కాకుండా కడుపులో ఉన్న బిడ్డ ఆడా, మగా తెలుసే పరీక్షలు చేస్తూ ఇద్దరు డాక్టర్లు.. వారికి సహాయం చేసిన మరో వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సరళ, ఆయేషా అనే ఇద్దరు మహిళా వైద్యురాళ్లు అత్తాపూర్ లోని ఉషోదయ హాస్పిటల్ లో పనిచేస్తున్నారు. కాగా... వీరిద్దరూ ఓ రిక్షా డ్రైవర్  ఆంజనేయులు తో కలిసి కుమ్మక్కయ్యారు. ఎవరైనా గర్భిణీ స్త్రీలు వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. వారితో ఆంజనేయులు, అతనికి మద్దతుగా నిలిచే కొందరు స్త్రీలు సదరు గర్భిణీలతో మాట కలిపేవారు.

AlsoRead అమ్మవారి కిరీటం దొంగతనానికి వచ్చి......

వారితో ఆ మాట, ఈ మాట మాట్లాడి.. కడుపులోని బిడ్డ లింగం తెలసుకునే ఆసక్తి ఉందో లేదో తెలుసుకుంటారు. వారికి ఆసక్తి ఉంది అని తెలయగానే.. వారితో రూ.9వేలకు బేరం కుదుర్చుకుంటారు. అనంతరం డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లి పరీక్షలు చేసి కడుపులో పిండం అమ్మాయి, అబ్బాయో చెప్పేస్తారు.

అయితే... వీరి వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వీరి గుట్టురట్టయ్యింది. లైంగిక నిర్ధారణ పరీక్షలు చేయించుకున్న దంపతుల దగ్గర నుంచి రూ.9వేలు  వసూలు చేస్తారు. దానిలో రూ.6వేలు ఆంజనేయులు తీసుకోగా.. రూ.3వేలు మిగిలిన డాక్టర్లు తీసుకుంటారు. కాగా.. నిందితులు ముగ్గురినీ అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు.