హైదరాబాద్: హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 21న జరుగుతున్న ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ జన సమితి మద్దతు ప్రకటించింది. టీజేఎస్ చీఫ్ కోదండరామ్ బుధవారం నాడు ఈ విషయాన్ని ప్రకటించారు.

హుజూర్‌నగర్  అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తున్న తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని  కోరుతూ రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం టీజేఎస్ చీఫ్ కోదండరామ్ ను కలిశారు.

హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో  కాంగ్రెస్ అభ్యర్ధి పద్మావతికి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా  కోదండరామ్ ప్రకటించారు. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధికి సీపీఐ మద్దతు ప్రకటించడం చారిత్రక తప్పిదమని  కోదండరామ్ అభిప్రాయపడ్డారు.

అధికారం తన స్వంత ఆస్తిగా కేసీఆర్ భావిస్తున్నాడని కోదండరామ్  విమర్శించారు.  ప్రభుత్వ ఉద్యోగులపై టీఆర్ఎస్ ప్రభుత్వ విధానం సరిగా లేదని ఆయన విమర్శించారు.