హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ విజయంపై కవిత ట్వీట్
20 సంవత్సరాలుగా కాంగ్రెకి కంచుకోటలా ఉన్న హుజూర్ నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ సొంతమైంది. ఉత్తమ్ కంచు కోటను సైదిరెడ్డి కొల్లగొట్టాడు. కాగా... టీఆర్ఎస్ విజయం పట్ల మాజీ ఎంపీ కవిత స్పందిచారు. ట్విట్టర్ వేదికగా కవిత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హుజూర్ నగర్ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా హుజూర్ నగర్ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాయి. ఎన్నికల ప్రచారం కూడా నువ్వా నేనా అన్నట్లు నిర్వహించారు.
అయితే... ప్రజలు మాత్రం టీఆర్ఎస్ కే పట్టం కట్టారు. 20 సంవత్సరాలుగా కాంగ్రెకి కంచుకోటలా ఉన్న హుజూర్ నగర్ ఇప్పుడు టీఆర్ఎస్ సొంతమైంది. ఉత్తమ్ కంచు కోటను సైదిరెడ్డి కొల్లగొట్టాడు. కాగా... టీఆర్ఎస్ విజయం పట్ల మాజీ ఎంపీ కవిత స్పందిచారు. ట్విట్టర్ వేదికగా కవిత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.
AlsoRead హుజూర్ నగర్ లో భారీ విజయం... అసలు ఎవరీ సైది రెడ్డి..
కెసిఆర్ గారి పైన అచంచలమైన విశ్వాసాన్ని ప్రదర్శించి, తెరాస పార్టీ కి అపురూపమైన విజయాన్ని అందించిన హుజూర్నగర్ ప్రజలకు ధన్యవాదాలు. ఈ విజయం కోసం నిరంతరం శ్రమించిన తెరాస కుటుంబ సభ్యులందరికి శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ కవిత ట్వీట్ చేశారు.