Asianet News TeluguAsianet News Telugu

TS News: క్రికెటర్‌ సిరాజ్‌ను కలిసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్.. ‘నా రికార్డు బ్రేక్ చేసినందుకు సంతోషంగా ఉంది’

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి టీమిండియా క్రికెటర్, హైదరాబాదీ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను కలిశారు. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా తన పేరిట ఉన్న రికార్డును సిరాజ్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉన్నదని కామెంట్ చేశారు.
 

huzurabad mla padi kaushik reddy met hyderabadi cricketer mohammed siraj kms
Author
First Published Jan 15, 2024, 7:28 PM IST

Hyderabad: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి టీమిండియా క్రికెటర్ మహమ్మద్ సిరాజ్‌ను కలివారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటోను కౌశిక్ రెడ్డి తన ట్విట్టర్ హ్యాండిల్‌ ద్వారా పంచుకున్నారు. సిరాజ్‌ను కలుసుకుని తన చిన్న తనాన్ని తానే కలుసుకున్నట్టుగా ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో ఫాస్టెస్ట్ బౌలర్‌గా తన పేరిట ఉన్న రికార్డును సిరాజ్ బ్రేక్ చేయడం సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.

పాడి కౌశిక్ రెడ్డి కూడా ఒకప్పుడు క్రికెటర్ అనే విషయం తెలిసిందే. ఆయన పాలిటిక్స్‌లోకి రాక మునుపు హైదరాబాద్ జట్టు తరఫున ఆడారు. 2004 నుంచి 2007 వరకు 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడినట్టు సమాచారం.

Also Read : Vangaveeti Radha: ఆ ప్రచారానికి చెక్ పెట్టిన వంగవీటి రాధా.. వైసీపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూ ట్విస్ట్

ఈ సందర్భంగానే ఆయన క్రికెటర్ సిరాజ్‌ను కలుసుకున్నారు. మహమ్మద్ సిరాజ్ సక్సెస్‌ను, ప్రయాణాన్ని చూస్తూంటే తనకు కొన్ని లైన్లు గుర్తుకు వస్తున్నాయి అంటూ పాడి కౌశిక్ రెడ్డి ఓ కొటేషన్ పేర్కొన్నారు.  నీ లోలోపలి బలమైన కోరిక నీ భవిష్యత్‌గా మారుతుందనే కొటేషన్ గుర్తుకు వస్తున్నదని పేర్కొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios