Vangaveeti Radha: ఆ ప్రచారానికి చెక్ పెట్టిన వంగవీటి రాధా.. వైసీపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానిస్తూ ట్విస్ట్
వంగవీటి రాధా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను తాజాగా ఆయన ఖండించారు. తాను టీడీపీలోనే ఉంటున్నట్టు వివరించారు. వైసీపీ నేతలే మారిపోయి టీడీపీలోకి రావాలని ఆహ్వానం పలికారు.
Vangaveeti Radha: వంగవీటి రాధా టీడీపీలో నుంచి వైసీపీలోకి మారుతున్నారనే ప్రచారం గత కొద్ది రోజులుగా జోరుగా సాగుతున్నది. తాజాగా, ఈ ప్రచారానికి వంగవీటి రాధా ఫుల్ స్టాప్ పెట్టారు. తాను టీడీపీ వీడటం లేదని స్పష్టం చేశారు. అంతేకాదు, వైసీపీ నేతలే టీడీపీలోకి రావాలని ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. వైసీపీ విజయవాడ అర్బన్ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ ఇంటికి ఇటీవలే రాధా వెళ్లారు. ఆయనతోపాటు ఇంకొందరు వైసీపీ నేతలను టీడీపీలోకి ఆహ్వానించినట్టు తెలిసింది.
వంగవీటి రాధా టీడీపీలో ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. చాలా కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంతో ఆయన టీడీపీతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నారనే టాక్ వచ్చింది. ఆయన వైసీపీలోకి వస్తున్నారనీ కొందరు వైసీపీ నేతలూ కామెంట్ చేశారు. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో మచిలీపట్నం లేదా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి బరిలోకి దింపాలని వైసీపీ యోచిస్తున్నట్టూ వైసీపీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read : YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా.. రెండు రోజుల్లో వైఎస్ షర్మిలకు పగ్గాలు!
ఇటీవల ఆయన కాశీకి వెళ్లినప్పుడూ ఆయన వెంట కొడాలి నాని కనిపించడం కూడా ఈ వదంతులకు బలాన్ని ఇచ్చాయి. కానీ, అదంతా వట్టి ప్రచారమేనని వంగవీటి రాధా అన్నారు. తాను టీడీపీలోనే ఉంటున్నట్టు స్పష్టత ఇచ్చారు. వైసీపీ లో చేరడం లేదని, ఆ పార్టీ నేతలే మారిపోయి టీడీపీలోకి రావాలని పిలుపు ఇచ్చారు.