హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఆర్ఎస్ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. సామాజిక వర్గాల మద్దతును కూడగడుతోంది. హన్మకొండ నియోజకవర్గంలోని పెంచికల్‌పేటలో సామాజిక వర్గాల ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.


 హైదరాబాద్:huzurabad bypollలో విజయం సాధించేందుకు trs నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ నియోజకవర్గంలో పలు సామాజికవర్గాల మద్దతును కూడగట్టేందుకు గులాబీ దళం ప్రయత్నాలు చేస్తోంది.గ్రామాలు, మండలాల వారీగా ఆయా సామాజిక వర్గాల వారీగా మద్దతును కూడగట్టే ప్రయత్నాలను టీఆర్ఎస్ నాయకత్వం చేస్తోంది. 

corona నేపథ్యంలో భారీ సభలు, ప్రచార ర్యాలీలు, రోడ్‌షోలపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. దీంతో హన్మకొండ జిల్లా పెంచికల్‌పేటలో సామాజిక వర్గాల ఆత్మీయ సమావేశాలను గులాబీ నేతలు నిర్వహిస్తున్నారు. పెంచికల్‌పేటలోని బహిరంగ ప్రదేశంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.

ఇదే స్థలంలో మూడు రోజుల క్రితం ఆరె కటికల సమ్మేళనం నిర్వహించారు. సోమవారం నాడు మున్నూరు కాపు ప్రతినిధులతో సమావేశం జరిగింది. టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌గా నియమితులైనbajireddy govardhan కు సన్మానం పేరిట జరిగిన ఈ కార్యక్రమానికి మున్నూరుకాపు ప్రతినిధులు హాజరయ్యారు. 

పక్షం రోజులపాటు మరిన్ని సామాజిక వర్గాలతో ఆత్మీయ సభలు కొనసాగించాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. పెంచికల్‌పేట కేంద్రంగా దసరా తర్వాత నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ హాజరయ్యే అవకాశముందని పార్టీ వర్గాలు చెప్పాయి. 

కులాలు, పథకాల లబ్ధిదారులైన్ల ఓటర్ల లెక్కలను ఇప్పటికే గ్రామాలు, వార్డుల వారీగా వర్గీకరించి నేతలకు పంపారు. ఆయా మండలాలు, మున్సిపాలిటీలవారీగా ఇన్‌చార్జీలుగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలకు టీఆర్ఎస్ నాయకత్వం పంపింది.

వీరితోపాటు మంత్రులు ఈ జాబితాలను వడపోసి ఓటర్ల మద్దతు కూడగట్టడంలో తలమునకలై ఉన్నారు. బయటకు సభలు, సమావేశాలు, ధూంధాంల పేరిట ప్రచార ఆర్భాటం జరుగుతుంది. అంతర్గతంగా మాత్రం సామాజికవర్గాలు, పథకాల లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని టీఆర్‌ఎస్‌ ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తోంది.

also read:Huzurabad Bypoll : ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు.. ఈటెల రాజేందర్ పై కేసు నమోదు..

ఈ నియోజకవర్గంలో రెడ్డి, మున్నూరుకాపు, పద్మశాలి, యాదవ, మాల, మాదిగ, ఎస్టీల ఓట్ల కోసం అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వందల సంఖ్యలో ఓటర్లు కలిగిన కుమ్మరి, పెరిక కులస్తులపైనా అదే కులా లకు చెందిన ఇన్‌చార్జి నేతలు దృష్టి పెట్టారు. 

మరో వైపు ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్‌ ఉద్యోగ సంఘాలతోపాటు కిరాణా, ఆయిల్, క్లాత్‌ మర్చంట్స్, సీడ్స్‌ ఫెర్టిలైజర్‌ డీలర్స్‌ అసోసియేషన్లు, లయన్స్‌ క్లబ్, రోటరీక్లబ్‌ వంటి స్వచ్ఛంద సేవా సంస్థల మద్దతు కోసం కూడా గులాబీదళం ప్రయత్నా లు సాగిస్తోంది.

టీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి etela rajender బయటకు వచ్చిన తర్వాత బీజేపీ వైపు తన క్యాడర్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈటల రాజేందర్ వెంట ఉన్న క్యాడర్ ను తమ వైపునకు తిప్పుకొనేందుకు గులాబీ దళం ప్రయత్నాలు చేస్తోంది.హుజూరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి harish rao మకాం వేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికను పురస్కరించుకొని నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు విస్తృతంగా పర్యటిస్తున్నారు.

ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడిన టీమ్ ఈ నియోజకవర్గంలో బీజేపీకి చెక్ పెట్టే వ్యూహా రచన చేస్తోంది.ఉప ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు చెందిన కీలక నేతలను టీఆర్ఎస్ లో చేర్పించారు. 

హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక వర్గాల వారీగా ఓటర్లు వివరాలు

రజక - 7,600
పద్మశాలి - 26.350
మాదిగ - 35,600
మున్నూరుకాపు- 29,100
గౌడ - 24,200
ముదిరాజ్ - 23,220
రెడ్డి - 22,600
యాదవ - 22,150
మాల- 11,100
మైనార్టీలు- 5,100
ఎస్టీలు - 4,220
నాయీ బ్రహ్మణ- 3,300
ఇతరులు - 12,050
కొత్త ఓటర్లు - 10,000