Huzurabad Bypoll : ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదు.. ఈటెల రాజేందర్ పై కేసు నమోదు..
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈటెల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
కరీంనగర్: హుజూర్ నగర్ ఉప ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. నేతల మాటల తూటాలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా అభ్యర్థి మాజీ మంత్రి etela rajender పై హుజురాబాద్ లో కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని ఈటెల రాజేందర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ వద్ద ఆటో, ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో రోడ్డుపై మృతుని బంధువులు ధర్నాకు దిగారు. huzurabad-పరకాల రోడ్డు మీద 3 గంటలుగా ఆందోళన చేయడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఘటనా స్థలంలో మృతుడి కుటుంబాన్ని భాజపా నేతలు ఈటెల రాజేందర్, వివేక్ పరామర్శించారు. వారికి సంఘీభావంగా రోడ్డుపై బైఠాయించారు.
కాగా, హుజురాబాద్‌లో ఉపఎన్నిక క్యాంపెయిన్ సోమవారం జోరుగా సాగింది. అటు trs, ఇటు bjpలో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి etela rajender భార్య ఈటల jamuna కూడా campaignలో దూసుకుపోతున్నారు. తాజాగా ఆమె జమ్మికుంట మండలం తనుగుల గ్రామంలో ప్రచారం చేశారు. గ్రామంలోకి వెళ్లగానే ఆమెకు ఆత్మీయ స్వాగతం లభించింది. గ్రామస్తులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆమెను సాదరంగా ఆహ్వానించారు.
ఈ ప్రచారంలో ఈటల జమున మాట్లాడారు. ఎంత మంది ప్రచారం చేసినా, ఎన్ని డబ్బులు ఖర్చుపెట్టినా ఈటల రాజేందరే గెలుస్తారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారని అన్నారు. ఈ ప్రజలకు ఈటల రాజేందర్ ఏం చేసిండో అర్థమైతలేదని ఇక్కడికి వచ్చిన నాయకులు అంటున్నారు. మీ ఓటు కోసం తెలంగాణ ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని జమున తెలిపారు. ధర్మాన్ని గెలిపించాలని, న్యాయం గెలువాలని అందరూ అనుకుంటున్నారని చెప్పారు.
huzurabad bypoll: 'ఈ' ఇంటి పేరున్న ముగ్గురు రాజేందర్ల నామినేషన్లు తిరస్కరణ
ఈటల రాజేందర్ పేరు చెబితే మీకు గౌరవం దక్కిందని, ఆయన అలా పని చేశారని ఈటల జమున తెలిపారు. శంబునిపల్లి వాళ్లు గుంటూరుకు పత్తి అమ్మడానికి పోతే.. అక్కడ ఈటల రాజేందర్ పేరు చెబితే మంచి ధర ఇవ్వడమే కాకుండా భోజన ఖర్చులకు కూడా డబ్బులు ఇచ్చి మరీ పంపించారట అని అన్నారు.
ఈటల రాజేందర్ ముగ్గురు సీఎంలను గడగడలాడించిన వ్యక్తి అని, కేసీఆర్‌ను ప్రశ్నించిన వ్యక్తి అని జమున చెప్పారు. దళిత బంధు అందరికీ ఇవ్వాలని, ఇతర కులాల్లోని పేదలకూ రూ. 10 లక్షలు ఇవ్వాలని తెలిపారు. ఈ సారి ఈటల రాజేందర్‌ను పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.