Huzurabad bypoll Result 2021: నాడు దుబ్బాక, నేడు హుజూరాబాద్‌, బీజేపీకి కలిసొచ్చిన సెంటిమెంట్

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ విజయం సాధించారు.ఈ ఎన్నికలకు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంచార్జీగా ఉన్నారు. గతంలో దుబ్బాక ఉపఎన్నికలకు కూడా ఆయనే ఇంచార్జీగా కొనసాగారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఎన్నికల్లో కూడా ఆయనే పార్టీని విజయం వైపు నడిపించారనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
 

Huzurabad bypoll Result 2021:Jitender Reddy key role in Bjp victory in Huzurabad bypoll

హైదరాబాద్: బీజేపీకి మాజీ ఎంపీ ap jithender reddy సెంటిమెంట్ కలిసొచ్చింది. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో  కూడా బీజేపీ విజయం సాధించింది. ఈ రెండు ఎన్నికల్లో టీఆర్ఎస్ ను బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్ధి Raghunandhan rao విజయం సాధించారు. హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజయం సాధించారు.

also read:Huzurabad ByPoll: ప్రత్యర్ధులిద్దరూ చోటా నేతలే.. అయినా ఈటల మెజారిటీ ఎందుకు తగ్గిందంటే..?

దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలను బీజేపీ, టీఆర్ఎస్ లు అత్యంత ప్రతిస్టాత్మకంగా తీసుకొన్నాయి. అయితే ఈ రెండు ఉప ఎన్నికల్లో బీజేపీదే పైచేయిగా మారింది. ఈ రెండు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ఆ పార్టీ నేత, ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఇంచార్జీగా వ్యవహరించారు. అయితే ఈ రెండు ఎన్నికల్లో Harish Rao పై జితేందర్ రెడ్డి పైచేయి సాధించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ కు మూడు మాసాల ముందే Bjp అగ్రనేతలు ఈ నియోజకవర్గంలో మకాం వేశారు. ఈ నియోజకవర్గంలోని మండలాలవారీగా బీజేపీ నేతలకు ఇంచార్జీలుగా నియమించారు. ఈ నియోజకవర్గానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంచార్జీగా బాధ్యతలు తీసుకొన్నారు.

దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ మూడో స్థానానికి పరిమితమైంది. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ సాధించిన రెండు ఎన్నికల్లో జితేందర్ రెడ్డి ఇంచార్జీగా వ్యవహరించారు.

ఉపఎన్నికలకు ముందు నుండి Etela Rajender కు చెందిన అనుచరులు, ఆయనకు మద్దతుదారులుగా ఉన్న పలువురిని అధికార పార్టీ తనవైపునకు తిప్పుకొంది. అయినా కూడా బీజేపీ నేతలు వెనక్కు తగ్గలేదు. వ్యూహాత్మకంగా అడుగులు వేసి ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.

టీఆర్ఎస్ కీలకనేతల గ్రామాల్లో కూడా బీజేపీ ఆధిక్యం సాధించింది. Gellu Srinivas Yadav స్వగ్రామంతో పాటు అత్తగారి ఊళ్లో కూడా బీజేపీ పై చేయి సాధించింది.వీణవంక మండలంతో పాటు హుజూరాబాద్ మండలాలు, హుజూరాబాద్ పట్టణాలపై టీఆర్ఎస్ ఆశలు పెట్టుకొంది. కానీ ఈ  తన వ్యూహాలతో టీఆర్ఎస్ ను బీజేపీ వెనక్కు నెట్టింది.

హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ఇంచార్జీగా ప్రకటించిన తర్వాత జితేందర్ రెడ్డి హుజూరాబాద్ లోనే మకాం వేశారు. పార్టీ ముఖ్య నేతలతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొంటూ పార్టీని విజయం దిశగా నడిపించారు.

ఈ నియోజకవర్గానికి చెందిన పలు పార్టీల నుండి కీలక నేతలను టీఆర్ఎస్ ముందుగానే తమ వైపునకు తిప్పుకొంది. అయినా కూడ తమ విజయానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా బీజేపీ నాయకత్వం వేసిన అడుగులు ఆ పార్టీకి కలిసివచ్చాయి.

దళితబంధు అంశంతో పాటు ఇతర అంశాలపై ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ నాయకత్వం చేసిన ప్రచారాన్ని ప్రజలు అంతగా నమ్మలేరని ఎన్నికల ఫలితాలు రుజువుచేశాయి.  టీఆర్ఎస్  నుండి తనను బయటకు పంపించారని  ఈటల రాజేందర్ చేసిన ప్రచారం ఆయనకు కలిసివచ్చింది.మరోవైపు నిరంతరం ప్రజల్లో ఉండడం కూడా ఆయనకు ప్లస్ అయింది.

మరోవైపు మంత్రివర్గం నుండి రాజేందర్ ను బయటకు పంపడం వంటి పరిణామం రాజేందర్ కు ప్రజల్లో సానుభూతిని తెచ్చి పెట్టింది. అంతేకాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత నుండి ఆయన నియోజకవర్గంలోనే ఉన్నారు. నిరంతరం ప్రచారంలో గడిపారు.

పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేసుకొంటూ ప్రత్యర్ధుల విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ పార్టీని విజయ పథంలోకి తీసుకెళ్లడంలో జితేందర్ రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios