Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: కారులో ఈవిఎంల తరలింపు వీడియో వైరల్... క్లారిటీ ఇచ్చిన రిటర్నింగ్ అధికారి

హుజురాబాద్ లో పోలింగ్ ముగిసాక అర్దరాత్రి ఓ ప్రైవేట్ కారులో ఈవిఎంలు,వివి ప్యాట్ లను తరలిస్తున్నారంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై రిటర్నింగ్ అధికారి వివరణ ఇచ్చారు. 

Huzurabad Bypoll: Election Returning Officer Ravinder Reddy Given Clarity on EVMs Found in Car
Author
Huzurabad, First Published Oct 31, 2021, 11:41 AM IST

కరీంనగర్: హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సులో కాకుండా ఓ ప్రైవేట్ కారులో ఈవీఎంలు, వివి ప్యాట్ లను తరలించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. దీంతో అధికార టీఆర్ఎస్ పోలీసుల సహకారంతో అర్ధరాత్రి ఈవిఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పును తారుమారు చేయడానికి ప్రయత్నిస్తోందంటూ పుకార్లు జరుగుతున్నాయి. ఈ ప్రచారంపై హుజురాబాద్ రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి స్పందించారు. 

సోషల్ మీడియా పుకార్లను నమ్మవద్దని... పనిచేయని వివి ప్యాట్ ను అఫీషియల్ వాహనం నుండి మరొక అఫీషియల్ వాహనములోకి మార్చి తరలించామన్నారు Huzurabad Returning Officer Ravinder Reddy. హుజరాబాద్ పోలింగ్ లో ఈ voter verifiable paper audit trail (VVPAT)  వాడలేమని....  పోలింగ్ ప్రారంభానికి ముందే ఈ వివి ప్యాట్ పనిచేయకపోవడంతో పక్కనపెట్టామన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ వివి ప్యాట్ ను కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల రిసెప్షన్ సెంటర్ కు ఎదురుగా గల రోడ్డుపై ఓ అధికారిక వాహనం నుండి మరొక అధికార వాహనంలోకి మార్చి గోదాంకు తరలించామన్నారు. 

Video  Huzurabad Bypoll: అర్ధరాత్రి హైడ్రామా... కారులో పట్టుబడ్డ ఈవీఎం మిషన్లు 

అయితే వివి ప్యాట్ ను మరో వాహనంలోకి మార్చి తరలిస్తుండగా అనుమానంతో ఎవరో వీడియో తీసినట్లున్నారు. అదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని రవీందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని హుజురాబాద్ నియోజకవర్గ  రిటర్నింగ్ అధికారి సూచించారు. 

read more  Huzurabad Bypoll: అర్ధరాత్రి హైడ్రామా... కారులో పట్టుబడ్డ ఈవీఎం మిషన్లు  

హుజురాబాద్ లో పోలింగ్ ముగిసిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటుచేసిన బస్సులో కాకుండా ఓ ప్రైవేట్ కారులో ఈవీఎంలను తరలించారంటూ కాంగ్రెస్, బిజెపి ఆరోపిస్తున్నాయి. ఇలా ఈవీఎంలను తరలించినట్లు అనుమానిస్తున్న కారును ఈవీఎంలను భద్రపరుస్తున్న కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అభ్యర్థి బల్మూరి వెంకట్ అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు తీవ్ర వాగ్వాదం జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 
 
టీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్ సమయంలో అక్రమంగా వ్యవహరించడమే కాదు పోలింగ్ తర్వాత కూడా ప్రజాతీర్పును మార్చే కుట్ర చేస్తోందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ వాహనంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ మనుషులు ఈవీఎంలను తరలించారని... పోలీసులు కూడా వారికి సహకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈవీఎం మిషన్లను ప్రభుత్వ వాహనంలో కాకుండా ప్రైవేట్ వాహనంలో తరలించాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. 

read more  టీఆర్ఎస్ కోట్లు ఖర్చుచేసింది.. హుజురాబాద్‌ ఫలితంతో తెలంగాణలో పెనుమార్పులు: ఈటల వ్యాఖ్యలు

ప్రైవేట్ వాహనంలో ఈవీఎంల తరలింపు,  కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి అభ్యర్థి బల్మూరి వెంకట్ అడ్డుకోవడం, పోలీసులతో వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ  వీడియోలను కాంగ్రెస్‌, బిజెపి నాయకులు ఎన్నికల కమిషనర్‌కు పంపించి పిర్యాదు చేసారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాలని ఈసికి బిజెపి, కాంగ్రెస్ నాయకులు సూచించారు. దీంతో ఈ వ్యవహారంపై రిటర్నింగ్ అధికారి రవీందర్ రెడ్డి  స్పందించి వివరణ ఇచ్చారు. 

Follow Us:
Download App:
  • android
  • ios