హుజూరాబాద్ ఉప ఎన్నిక: ఈటల భార్య జమున ఆస్తులు మూడేళ్లలో మూడింతలు
మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ సతీమణి జమున ఆస్తులు గత మూడేళ్ల కాలంలో మూడింతలు పెరిగాయి. నామినేషన్ పత్రాలకు జత చేసిన అఫడివిట్ లో జమున ఆ వివరాలను పొందుపరిచారు.
కరీంనగర్: మాజీ మంత్రి, బిజెపి నేత ఈటల రాజేందర్ సతీమణి జమున ఆస్తులు గత మూడేళ్లలో మూడింతలు పెరిగాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఆమె సోమవారంనాడు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రంతో పాటు జత చేసి అఫిడవిట్ లో ఆమె ఆస్తుల వివరాలను పొందుపరిచారు.
జమున ఆస్తుల విలువ రూ.43.47 కోట్ల రూపాయలు ఉంటుందని అఫిడివట్ లో తెలిపారు. 2018 ఎన్నికల్లో ఆమె ఆస్తుల విలువ రూ.14.5 కోట్లు మాత్రమే ఉంది. ప్రతి ఎన్నికల్లోనూ ఈటల రాజేందర్ కన్నా ముందు ఆయన భార్య జమున నామినషన్ పత్రాలు దాఖలు చేస్తారు. ఇది ఈటల రాజేందర్ సెంటిమెంట్. ఈసారి కూడా ఆయన ఆ సెంటిమెంట్ ను పాటించారు.
Also Read: Huzurabad Bypoll: బిగ్ న్యూస్... హుజురాబాద్ లో ఈటల జమున నామినేషన్
ప్రధానమైన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల జమున ఆస్తులు పెరిగాయి. మొత్తం రూ.43.47 కోట్లలో చరాస్తుల విలువ రూ.28.68 కోట్లు, స్థిరాస్తుల విలువ రూ.14.78 కోట్లు ఉంటుంది. ఆభరణాలు, ఇతర విలువైన వస్తువుల విలువ రూ. 50 లక్షలు ఉంటుంది. ఇందులో 1.5 కిలోల బంగారం ఉంది. కాగా ఆమెకు రూ.4.89 కోట్లు ఉంది.
జమున తరఫున బిజెపి నాయకులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. పార్టీ నాయకత్వం ఆదేశాల మేరకు నామినేషన్ పత్రాలు దాఖలు చేసినట్లు తెలిపారు. దానితో పాటు అఫిడవిట్ దాఖలు చేశారు. దాంట్లో ఆమె ఆస్తుల వివరాలు, అప్పుల వివరాలు పొందుపరిచారు.
హుజూరాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థిగా బిజెపి ఈటల రాజేందర్ ను ఖరారు చేసింది. తమ భార్యల చేత నాయకులు నామినేషన్ వేయించడం పరిపాటిగా వస్తుంది. తమ నామినేషన్ తిరస్కరణకు గురైనా వారు పోటీలో నిలువడానికి వీలవుతుంది.
Also Read: Huzurabad Bypoll: తమ్ముడూ అంటూనే... తడిగుడ్డతో నా భర్త గొంతు కోసారు కేసీఆర్: ఈటల జమున (వీడియో)
ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ బర్తరఫ్ అయిన క్షణం నుంచే జమున హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు. ఆమె గ్రామాలను చుట్టుముట్టుడుతున్నారు. దీంతో జమున బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం ఓ సందర్భంలో జరిగింది.
హుజూరాబాద్ శాసనసభకు అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుంది. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. బిజెపి అభ్యర్థిగా ఆయన పోటీ చేయనున్నారు. ఈ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.